NTR Fan Shyam : అభిమాని మరణం.. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు, నిఖిల్ ట్వీట్స్..

ఎన్టీఆర్ అభిమాని మరణం పై సినీ, రాజకీయ ప్రముఖులు ట్వీట్స్. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు దీని పై స్పందిస్తూ.. శ్యామ్ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు.

Chandrababu Naidu Nikhil tweets on NTR fan Shyam

NTR Fan Shyam : ఆంధ్రప్రదేశ్ కి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం అందర్నీ కలిచివేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. చింతలూరు గ్రామంలో ఒక రూమ్ లో ఉంటున్నాడు. జూన్ 25న శ్యామ్ తన రూమ్ లో ఉరి వేసుకొని మరణించాడు. గతంలో విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరుకాగా.. ఆ సమయంలో శ్యామ్ స్టేజి పైకి వెళ్లి ఎన్టీఆర్ ని కౌగిలించుకున్నాడు. అప్పటిలో ఆ వీడియోతో శ్యామ్ చాలా వైరల్ అయ్యాడు. ఇక తను చనిపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ వీడియో పోస్ట్ చేసి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Pawan Kalyan : ఆదిపురుష్ సినిమా ఎలా ఉన్నా.. ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..

అయితే ఇంతలో అది ఆత్మహత్య కాదు హత్య అంటూ సోషల్ మీడియాలో వార్త రావడం, దీంతో తోటి ఎన్టీఆర్ అభిమానులు దాని పై ట్వీట్స్ వెయ్యడం, ఇతర హీరో అభిమానులు కూడా దాని గురించి #WeWantJusticeForShyamNTR అంటూ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేశారు. ఇక ఈ వార్త ఏపీ అండ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవ్వడంతో ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు, నిఖిల్ వంటి పలువురు సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన సానుభూతిని తెలియజేశాడు.

“శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు. యంగ్ హీరో నిఖిల్.. “సినిమా అభిమాని కూడా మాలో ఒకడు. ఎందుకంటే వాళ్ళ వల్లే సినిమా బ్రతుకుంది. శ్యామ్ విషయాన్ని కొంచెం గమనించండి అంటూ ఏపీ పోలీసులను కోరాడు”.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. “శ్యామ్ మరణం నన్ను బాగా బాధించింది. అనుమానకర రీతిలో జరిగిన శ్యామ్ మరణం పై సరైన విచారణ జరపాలని నేను గట్టిగ కోరుతున్నాను” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇందులో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, ఈ విషయంలో సరైన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పుకొచ్చారు.

కాగా వైఎస్సార్‌సీపీ సభ్యులు దీని పై స్పందిస్తూ.. శ్యామ్ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. దీనిని రాజకీయం చేయకండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.