Chandramukhi 2 Release Trailer : 17 ఏళ్ల క్రితం గంగ వీర‌నాట్యం చేసింది.. ఇప్పుడు ఇది ఏ తాండ‌వం చేస్తుందో..?

రాఘవ లారెన్స్ , కంగనా రనౌత్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Chandramukhi 2 : రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా ఆస్కార్‌ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి (MM Keeravaani) సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌ముఖి-2 నుంచి రెండో ట్రైల‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్ ప్రారంభం కాగానే.. ’17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ త‌నే చంద్ర ముఖి అనుకుని వీర నాట్యం చేసింది. ఇప్పుడు ఒరిజిన‌ల్ పీసే దిగింది. ఇది ఏ తాండ‌వం చేస్తుందో ఏమో.’ అనే వ‌డివేలు వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభమైంది. ‘దెయ్యానికి వ‌య‌సు అవుతుందా అవ‌దా..? జుట్టు గిట్టు రాలుతుందా రాల‌దా..?’ అంటూ లారెన్స్ తో వ‌డివేలు చెప్పే డైలాగ్ బాగుంది. మొద‌టి ట్రైల‌ర్‌లో చంద్ర‌ముఖి క్యారెక్ట‌ర్ పెద్ద‌గా చూపించ‌లేదు. అయితే.. తాజా ట్రైల‌ర్‌లో చంద్ర‌ముఖి పాత్ర‌ను రివీల్ చేశారు. మొత్తంగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాపై ఈ ట్రైల‌ర్ అంచ‌నాల‌ను పెంచింది.

Bigg Boss 7 : ‘నువ్వు కంటెండర్‌వి కాదు. నిన్నెందుకు పిలుస్తారు..’ నాగార్జున ఫైర్‌

తెలుగులో శ్రీలక్ష్మీ మూవీస్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తోంది. వడివేలు, రాధికా శరత్ కమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా 2005లో సూప‌ర్‌ హిట్ గా నిలిచిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా వ‌స్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు