ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.