Charan-Tarak : ఆస్కార్ విన్నింగ్ పై రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఏం పోస్ట్ చేశారో తెలుసా?

ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు............

Charan and Tarak special posts on Naatu Naatu Oscar Winnings

Charan-Tarak :  ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలుగు సినిమా RRR నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు, ఇండియన్ పాటగా నాటు నాటు చరిత్ర లిఖించింది. ఆస్కార్ వేదికపై చంద్రబోస్, కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు.

ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు పట్టుకున్న ఫోటోని షేర్ చేసి.. ఆస్కార్ సాధించాం. చంద్రబోస్, కీరవాణి, జక్కన్నలతో పాటు భారతీయులందరికి కంగ్రాట్స్ అని పోస్ట్ చేశాడు.

RRR Team at Oscars Celebrations : ఆస్కార్ వేడుకల్లో RRR టీం సందడి…

ఇక రామ్ చరణ్ ఆస్కార్ విజయంపై ఒక ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేశాడు. ఈ నోట్ లో.. RRR సినిమా మా లైఫ్స్ లో, ఇండియన్ సినిమాలో ఒక స్పెషల్ సినిమాగా ఎప్పటికి నిలిచిపోతుంది. నేను ఇంకా ఒక కలలోనే ఉన్నాను. రాజమౌళి, కీరవాణి గారు ఇండియన్ సినిమాలో లెజెండ్స్ లాంటి వాళ్ళు. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికీ థ్యాంక్యూ. నాటు నాటు ప్రపంచమంతా ఒక ఎమోషన్ లా మారింది. చంద్రబోస్, కీరవాణి, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అంతా కలిసి ఆ ఎమోషన్ ని తీసుకొచ్చారు. నా బ్రదర్ తారక్ కి థ్యాంక్యూ. నీతో మళ్ళీ కలిసి డ్యాన్స్ చేసి మరిన్ని రికార్డులు సృష్టించాలి. థ్యాంక్ యు అలియాభట్. ఈ అవార్డు ప్రతి ఇండియన్ సినిమా యాక్టర్ కి, టెక్నీషియన్ కి, సినిమా ప్రేమికులకు దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు. ఈ విజయం మన దేశ విజయం అని రాశాడు చరణ్.