Che Guevara Biopic CHE in under post production first look poster launch by Che Guevara daughter Aleida Guevara
Che Guevara Biopic : తెలుగు తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం “చే” లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ బయోపిక్ కు రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు.
ఆల్రెడీ చే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ పోస్టర్ ను తాజాగా చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.
Ram Charan : రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ తమిళ్ డైరెక్టర్‌తో? నిజమేనా?
అనంతరం హీరో, దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… విప్లవ వీరుడు, యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపోందించాం అని చెప్పారు. అలాగే.. ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే త్వరలో సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని అనౌన్స్ చేస్తాం అని తెలిపారు..