Che Teaser
Che Teaser released : నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా “చే” . లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిశంకర్ సంగీతాన్ని అందిస్తుండగా లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.
చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అక్టోబర్ 9న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం ఎంతో గర్వంగా అనిపిస్తుందన్నారు.
Uday Kiran : అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సింది.. కానీ మహేష్ బాబు..
చేగువేరా చేసిన పోరాటలు, త్యాగాలు ఈ సినిమాలో చూపించినట్లు చెప్పారు. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయడాన్నిఅదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వచ్చిందన్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని, నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నట్లు చెప్పారు.