Chennai court verdict today on Jana Nayagan censorship controversy.
Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా విడుదల అనేది విజయ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ గా మారింది. దానికి కారణం జన నాయగన్ విజయ్ కి చివరి సినిమా కావడమే.
అయితే, ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా జనవరి 9న విడుదల కావాలి. కానీ, జన నాయగన్(Jana Nayagan) సినిమాపై సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. దాదాపు 32 సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. దీంతో, విడుదలకు ఒకరోజు ముందు జన నాయగన్ మూవీ వాయిదా పడింది. సెన్సార్ అభ్యంతరాలకు ఒప్పుకొని మూవీ టీం కోర్టుకు వెళ్లారు. తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరారు.
The Rajasaab sequel: ‘ది రాజాసాబ్’ సీక్వెల్ ఫిక్స్.. జోకర్ గా ప్రభాస్.. టైటిల్ ఏంటో తెలుసా?
ఈ పిటీషన్ పై ఇవాళ ఉందయం 10:30కి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. అయితే, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఇన్ని అభ్యంతరాల మధ్య జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. కానీ, విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎదురుచూపులు ఆపడం లేదు. ఇప్పటికే, సినిమాను ఫస్ట్ డే చూడాలని చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు.
వారికి రిఫండ్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. కేవలం, ఈ అడ్వాన్స్ సేల్స్ తోనే ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. మరి ఇవాళ కోర్టు ఏ తీర్పు ఇస్తుందా అనేది చూడాలి.