సినిమాలు వస్తేనే బాధితులు గుర్తొస్తారా?: వారికి పింఛన్ పథకం ప్రకటించిన ప్రభుత్వం

  • Publish Date - January 13, 2020 / 04:28 AM IST

సినిమాలు ప్రభావితం చేస్తాయి. సినిమాలు సంఘటిత పరుస్తాయి. కొన్ని సినిమాలు పోరాటం చేస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రభుత్వాలను కూడా కదిలిస్తాయి. సినిమాలకు అంతటి శక్తి ఉంది. కాదనలేం.. బాలీవుడ్‌లో విడుదలై ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ‘ఛపాక్’.  యాసిడ్ అటాక్ నుంచి ప్రాణాలతో బయటపడిన లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

లక్ష్మి అగర్వాల్ యాసిడ్ దాడి నుండి ఎలా బయటపడింది. వారి యాసిడ్ దాడి నుండి బయటపడినవారికి న్యాయం కోసం పోరాడటంలో ఎలా సహాయపడింది అనే విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇందులో నటించిన దీపిక నటనకు బాలీవుడ్ జనం సలాం కొడుతున్నారు.

మగాడికి ఈజీ టార్గెట్ అయిన మహిళను.. సమాజంలోని కొందరు మృగాళ్లు..  రేప్ చేయటానికి, హత్య చేయటానికి, నిరాకరిస్తే యాసిడ్ పోసేసి ఛపాక్ మని క్షణాల్లో వారి అందాన్ని, ఆశలను బుగ్గాపాలు చేస్తారు. అటువంటి కథాంశమే.. కాదు అటువంటి వ్యక్తి జీవితమే ఛపాక్. అయితే అటువంటి పాత్రలో నటించడం అంటే మాములు విషయమా? డీ గ్లామరైజ్ అయిపోవాలి. తెరమీద మనిషిని చూస్తే కళ్లు మూసుకునేంతలా మారిపోయి. ఎంతోమంది కళ్లు తెరిపించేలా సినిమాని వెండితెరపై ఆవిష్కరించింది దీపిక. 

సినిమా అంటే రకరకాల రంగులను కళ్ల ముందు ఆవిష్కరిండమే అయినా సినిమా ప్రభావితం చేసినట్లుగా మరే సాధనం ప్రభావితం చెయ్యలేదు అనేది వాస్తవం. వినోదాన్ని, అందాన్ని అలరించే అనేకానేక కమర్షియల్ అంశాలను కలబోసి, ఆ కాసేపు థియేటర్‌లో కూర్చోబెట్టే వ్యాపామే అయినా సరే, ప్రభుత్వాన్ని కూడా కదపగలిగే శక్తి ఈ సినిమా అని నిరూపించుకుంది ఛపాక్. 

దీపికా తన అందంతో కాదు, వయ్యారాలతో అసలే కాదు, అంగాంగ ప్రదర్శనలతో అసలే కాదు.. కానీ ప్రభావితం చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాసిడ్‌ బాధితులకు ఫించన్‌ను అందించేలా ఈ సినిమా ప్రభావితం చేసింది. ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్యా ఈ మేరకు విషయాన్ని వెల్లడించారు లేటెస్ట్‌గా. యాసిడ్‌ దాడి బాధితులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రతి ఏడాది రూ.5000 నుంచి రూ.6000 నగదును ఫించన్‌గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఛపాక్ సినిమాకి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది.

ఉత్తరాఖండ్ నిర్ణయాన్ని అనేకమంది స్వాగతిస్తున్నారు. అయితే సినిమాలు వస్తేనే బాధితులు గుర్తొస్తారా? అని విమర్శలు చేసేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్రతి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని అనేవాళ్లు కూడా ఉన్నారు.