Chikkadapalli Police gives Notice to Allu Arjun for Investigation in Sandhya Theater Incident
Allu Arjun : అల్లు అర్జున్ కి తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం అనగా డిసెంబర్ 24న 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడానికే ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
మరి అల్లు అర్జున్ రేపు విచారణకు వెళ్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. రేపు అల్లు అర్జున్ విచారణకు వెళ్తే పోలీసులు బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అలాగే సంధ్య థియేటర్ ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో వచ్చిన వ్యక్తిగత సిబ్బంది పై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. దీంతో రేపు బన్నీ విచారణకు వెళ్తారా, వెళ్తే ఏం మాట్లాడతారు అని టాలీవుడ్ లో అభిమానుల్లో చర్చగా మారింది.
Also Read : Pushpa 2 : ఓ వైపు అల్లు అర్జున్ వివాదం.. అయినా మరోవైపు పుష్ప 2 రికార్డులు.. లేటెస్ట్ రికార్డ్ ఏంటో తెలుసా?
ఇటీవల పోలీసులు మాట్లాడుతూ అల్లు అర్జున్ పర్సనల్ సిబ్బందికి తొక్కిసలాట ఘటన గురించి చెప్పిన బన్నీ వద్దకు వెళ్లనివ్వలేదని, తామే చెప్తామని చెప్పినట్టు తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత సిబ్బందిపై కూడా పోలీసులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో రేపు బన్నీని ఆ రోజు వచ్చిన వ్యక్తిగత సిబ్బంది గురించి ఆరాతీసి వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ ఓ సారి అరెస్ట్ అయి హైకోర్టు బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. ప్రస్తుతం బన్నీ ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తాను అని బెయిల్ మీద బయట ఉన్నారు. అధికారులు బెయిల్ రద్దు చేయడానికి కోరతారని, మళ్ళీ బన్నీని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది.
Also See : Game Changer : అమెరికా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయిగా..