Sara Arjun : అప్పటి చిన్న పాప.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ.. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో పక్కన..

చిన్నప్పుడే తన నటనతో అందర్నీ మెప్పించింది.

Sara Arjun

Sara Arjun : చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది తర్వాత హీరోలు, హీరోయిన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో మరో చైల్డ్ ఆర్టిస్ట్ చేరింది. విక్రమ్ తో కలిసి నాన్న సినిమాలో నటించిన సారా అర్జున్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ ఒక్క సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. చిన్నప్పుడే తన నటనతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత దాదాపు ఓ 25 సినిమాలు ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

సారా అర్జున్ పెద్దయ్యాక పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ యంగ్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాతోనే త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సారా అర్జున్ ఏకంగా బాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : OG Theatrical Rights : హరిహర వీరమల్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే OG థియేటరికల్ రైట్స్ కోసం పోటీ..

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా దురంధర్. నేడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి డిసెంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి సినిమానే హీరోయిన్ బాలీవుడ్ లో చేయడం, స్టార్ హీరో చేస్తుండటంతో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

సారా అర్జున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దురంధర్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..

 

Also Read : Allu Arjun : అమెరికాలో ‘అల్లు అర్జున్’.. లేటెస్ట్ ఫొటోలు వైరల్..