×
Ad

Child Artist : OG సినిమాలో పవన్ కళ్యాణ్ కి కూతురుగా నటించిన ఈ క్యూట్ పాప.. ఎవరో తెలుసా?

OG సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం గ్యాంగ్ స్టర్ మాత్రమే కాకుండా తండ్రి పాత్రలో కనిపించి మంచి ఎమోషన్ పండించారు.(Child Artist)

Child Artist

Child Artist : పవన్ కళ్యాణ్ OG సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. మొదటి రోజే OG సినిమా ఏకంగా 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఫ్యాన్స్ ఈ సినిమాతో, సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే OG సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం గ్యాంగ్ స్టర్ మాత్రమే కాకుండా తండ్రి పాత్రలో కనిపించి మంచి ఎమోషన్ పండించారు.(Child Artist)

గతంలో ఖుషి సినిమా క్లైమాక్స్ లో ఒక నిమిషం పాటు పిల్లలకు తండ్రిగా కనిపిస్తాడు. అది ఒక సరదా సీన్. ఆ తర్వాత పవన్ మళ్ళీ ఎప్పుడూ తండ్రి పాత్ర చేయలేదు. కానీ OG సినిమా సెకండ్ హాఫ్ మొత్తం తండ్రి ఎమోషన్ కూడా నడుస్తుంది. దీంట్లో పవన్ కి కూతురిగా ఒక పాప నటించింది. ఆ పాప పేరు సాయేషా షా.

Also Read : Sujeeth : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి నో చెప్పిన సుజీత్.. తన ఫేవరేట్ హీరో కోసం..

సాయేషా ముంబైకి చెందిన పాప. చిన్నప్పట్నుంచి చాలా యాడ్స్ లో నటించింది. డెటాల్, యూరో కిడ్స్, సంతూర్, టాజెల్, లెన్స్ కార్ట్, పలు రియల్ ఎస్టేట్ యాడ్స్.. ఇలా చాలా యాడ్స్ లో నటించింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో నటించింది సాయేషా. మృణాల్ ఠాకూర్ తో ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కూడా చేసింది.

సాయేషాకు OG నే ఫస్ట్ సినిమా కావడం గమనార్హం. ఓ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సాయేషాని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి కూతురుగా సాయేషా మంచి ఎమోషన్ పండించింది. మున్ముందు ఈ పాపకు సినిమాల్లో మంచి అవకాశాలు రావడం ఖాయం. సాయేషా OG సినిమాలో తనతో నటించిన అర్జున్ దాస్, రాజ్ తిరందాస్ లతో షూటింగ్ సమయంలో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో అయితే ఇంకా షేర్ చేయలేదు. పవన్ తో ఒకవేళ ఫోటో దిగి ఉంటే, ఆ ఫోటో షేర్ చేస్తే సాయేషా వైరల్ అవ్వడం గ్యారెంటీ.


 

Also Read : OG 2 : ఓజీ సీక్వెల్ కాదా? ప్రీక్వెల్..? సుభాష్ చంద్రబోస్ తో లింక్.. OG పార్ట్ 2 కథ ఇదే..