Coco Lee : ఆత్మహత్య చేసుకున్న స్టార్ సింగర్..

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న కోకో లీ కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు సమాచారం. ఆ డిప్రెషన్ లోనే ఇటీవల కోకో లీ ఆత్మహత్య చేసుకుంది.

Chinese star singer Coco Lee passes away

Singer Coco Lee :  48 ఏళ్ళ చైనీస్ స్టార్ సింగర్ కోకో లీ ఆత్మహత్య చేసుకొని మరణించడం చైనాలో విషాదం నింపింది. 90వ దశకంలో పాప్ స్టార్ గా పేరు తెచ్చుకుంది చైనీస్ సింగర్ కోకో లీ. చైనా, మలేషియా, తైవాన్, సింగపూర్, అమెరికా.. పలు దేశాల్లో కోకో లీకి భారీగా అభిమానులు ఉన్నారు. చైనాకు చెందిన కోకో లీ అమెరికాకు వెళ్లి అక్కడ చదువుకొని అనంతరం చైనాకు తిరిగివచ్చి సింగర్ గా కెరీర్ మొదలుపెట్టింది.

30 ఏళ్ళ పాటు చైనీస్ తో పాటు, అమెరికాలో కూడా పాటలు పాడింది కోకో లీ. అమెరికాలో పలు సినిమాలకు, ముఖ్యంగా డిస్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. 2001లో కోకో లీ పాడిన ఓ పాట ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అవ్వడంతో ఆస్కార్ స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొదటి చైనీస్ సింగర్ గా కూడా రికార్డ్ సృష్టించింది కోకో లీ.

Producer SKN : అన్నకు ‘టాక్సీవాలా’తో హిట్ ఇచ్చా.. తమ్ముడికి ‘బేబీ’తో ఇస్తా.. అర్జున్ రెడ్డి కంటే ముందే విజయ్‌కి ఛాన్స్ ఇచ్చా..

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న కోకో లీ కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు సమాచారం. ఆ డిప్రెషన్ లోనే ఇటీవల కోకో లీ ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు గమనించి హాస్పిటల్ కి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. మూడు రోజులు చికిత్స పొందుతూ తాజాగా కోకో లీ కన్నుమూసింది. దీంతో ఆమె అభిమానులు, చైనీస్ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. కోకో లీ ఆత్మహత్య ఘటన చైనాలో సంచలనంగా మారింది. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధలు కోకో లీకి ఏమున్నాయి అని అంతా చర్చించుకుంటున్నారు.