సంక్రాంతి బరిలో ఉన్న గేమ్‌ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. మరో 10 రోజుల్లో మూవీ రిలీజ్ కాబోతుండటంటో ఓ రేంజ్‌లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తోంది మూవీ యూనిట్. రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిన గేమ్‌ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి దిల్‌రాజు ప్రొడ్యూసర్. జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో విజయవాడలో అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్‌ను నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఈవెంట్ సక్సెస్ అవ్వటంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు మూవీ యూనిట్. ఇక జనవరి 4 లేదా 5 తేదీల్లో గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో భారీస్థాయిలో నిర్వహించేందుకు రెడీ అతున్నారు.
జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ నాడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు. జనవరి 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. దీనికి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయిన నిర్మాత దిల్‌రాజు గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జనవరి 1న హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గేమ్‌ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయించాలనుకుంటున్నారని టాక్. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్..ట్రైలర్ లాంచ్‌కు చిరు గెస్ట్‌గా రాబోతున్నారని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.