Chiranjeevi – Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఆమె..? కొడుకుతో చేసి ఇప్పుడు తండ్రితో..?

చిరుకు జోడిగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.

Chiranjeevi Anil Ravipudi Movie Heroine

Chiranjeevi – Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించకపోయినా అనిల్ రావిపూడి మాత్రం చిరుతో సినిమా ఉందని చెప్పాడు. చిరు కూడా ఓ ఈవెంట్లో అనిల్ తో కామెడీ సినిమా అచేయడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు. త్వరలో స్టార్ట్ కాబోతున్న ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోందట.

ఇప్పటికే ఫస్ట్ పార్ట్ స్టోరీని లాక్ చేసిన అనిల్ సినిమా కాస్టింగ్‌ మీద ఫోకస్ పెట్టారు. చిరుకు జోడిగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. గత కొన్ని రోజుల నుంచి అదితి రావు హైదరీ పేరు వినిపిస్తున్నా ఇంకా కన్ఫామ్‌ కాలేదంటున్నారు. అయితే లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పేరు కూడా ప్రచారం జరుగుతోంది.

Also Read : Chiranjeevi – Balakrishna : బాలయ్యతో పాటు చిరంజీవి కూడా.. ఒకే సినిమాలో.. ఫ్యాన్స్ కి పండగే.. కాకపోతే తెలుగు సినిమాలో కాదు..

తెలుగమ్మాయి, హీరోయిన్ అంజలిని చిరు సినిమాలో తీసుకోవాలని అనుకుంటున్నారట. అంజలి అయితే హోమ్‌లీ లుక్‌తో పాటు మెగాస్టార్‌కు కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని అనుకుంటున్నారు. తన సినీ కెరీయర్ స్టార్టింగ్‌లోనే అంజలి వెంకటేశ్‌కు జోడిగా నటించింది. ఆల్ రెడీ గేమ్‌ఛేంజర్‌లో చిరు తనయుడు రామ్‌చరణ్‌కు జోడిగా నటించింది. అదే సినిమాలో చరణ్‌కు తల్లిగా కూడా చేసింది.

ఇప్పుడు చిరు నటించబోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన అంజలి నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. హీరోయిన్‌ సెలక్షన్‌పై మెగాస్టార్‌తో డిస్కస్ చేస్తున్నారట డైరెక్టర్. సమ్మర్ వరకు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.