Chiranjeevi – Balakrishna : బాలయ్యతో పాటు చిరంజీవి కూడా.. ఒకే సినిమాలో.. ఫ్యాన్స్ కి పండగే.. కాకపోతే తెలుగు సినిమాలో కాదు..

చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం వేరే లెవల్లో ఉంటుంది.

Chiranjeevi – Balakrishna : బాలయ్యతో పాటు చిరంజీవి కూడా.. ఒకే సినిమాలో.. ఫ్యాన్స్ కి పండగే.. కాకపోతే తెలుగు సినిమాలో కాదు..

Chiranjeevi Balakrishna will doing a film together

Updated On : March 15, 2025 / 9:48 PM IST

Chiranjeevi – Balakrishna : టాలీవుడ్ లెజెండ్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఒకరంటే ఒకరికి పోటీ ఉన్నా బయట మాత్రం ఇద్దరూ బాగానే ఉంటారు. అయితే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం వేరే లెవల్లో ఉంటుంది. అసలు అది సాధ్యమేనా అని సందేహాలు వస్తాయి.

కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్ళ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. నాకు బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహా రెడ్డి క్యారెక్టర్స్ ని పెట్టి ఎవరైనా కథ చేస్తే నేను, బాలయ్య చేయడానికి రెడీ. ఆ క్యారెక్టర్స్ తో కథ ఎవరు తీసుకొస్తారో చూడండి. బోయపాటి కథ రాస్తావా నీకు ఛాలెంజ్. వైవిఎస్ చౌదరి నువ్వు కూడా ట్రై చెయ్.. ఎవరైనా రచయితలు ఈ క్యారెక్టర్స్ తో కథ రాసి తీసుకురండి మేము చేస్తాము అని అన్నారు.

Also Read : Pawan Kalyan: ఏ భాషనైనా బలవంతంగా రుద్దడం.. గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సరికాదు.. కానీ..: పవన్ కల్యాణ్

దీంతో అప్పట్నుంచి ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తారు అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మైత్రి నిర్మాతలు కూడా ఈ ఇద్దర్ని కలిపే సినిమా తీయడానికి నిర్మాతలుగా రెడీ అన్నారు. బోయపాటి ఈ ఇద్దర్ని డీల్ చేస్తాడని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇద్దరూ కలిసి కాకపోయినా ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించబోతున్నారట.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళ్ సినిమా జైలర్ 2 షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాలో కనడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ గెస్ట్ పాత్రలు చేశారు. ఆ సినిమాలో బాలయ్య కూడా ఒక పాత్ర చేయాలి కానీ ఆ సమయంలో కుదరలేదని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ గతంలో చెప్పాడు. అయితే ఇప్పుడు జైలర్ 2 సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ పాత్రలతో బాలకృష్ణ కూడా ఉంటాడని ఇప్పటికే అంతా భావిస్తున్నారు.

Also Read : Veera Dheera Soora : విక్రమ్ ‘వీర ధీర శూర’ పార్ట్ 2 టీజర్ రిలీజ్.. పార్ట్ 1 సినిమా తీయకుండానే పార్ట్ 2..

తాజా సమాచారం ప్రకారం జైలర్ 2 సినిమాలో బాలకృష్ణతో పాటు చిరంజీవి కూడా ఉంటారట. ఇప్పటికే చిరంజీవికి రజినీకాంత్ ఫోన్ చేసి అడిగాడని, అందుకు చిరు ఒప్పుకున్నాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బాలయ్య, చిరంజీవి కలిసి ఒకేసారి స్క్రీన్ పై కనిపించకపోయినా ఒకే సినిమాలో మాత్రం కనిపిస్తారని భావిస్తున్నారు. చిరు, బాలయ్య సినిమాలో ఓ 5 నిముషాలు గెస్ట్ పాత్రల్లా ఉంటారట. నిజంగా చిరు, బాలయ్య జైలర్ 2 సినిమాలో ఉంటే తెలుగులో భారీ మార్కెట్ జరిగి జైలర్ కంటే పెద్ద హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.