Veera Dheera Soora : విక్రమ్ ‘వీర ధీర శూర’ పార్ట్ 2 టీజర్ రిలీజ్.. పార్ట్ 1 సినిమా తీయకుండానే పార్ట్ 2..
'వీర ధీర శూర పార్ట్ 2' టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.

Chiyaan Vikram SJ Suryah Veera Dheera Soora Teaser Released
Veera Dheera Soora : తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వీర ధీర శూర పార్ట్ 2. ఈ సినిమా మార్చి 27న తమిళ్, హిందీ, తెలుగులో రిలీజ్ కానుంది. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మాణంలో ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Samantha : నిర్మాతగా సమంత మొదటి సినిమా ఇదే.. టైటిల్ ఏంటంటే?.. త్వరలోనే రిలీజ్..
చియాన్ విక్రమ్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ ‘వీర ధీర శూర పార్ట్ 2’ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. మీరు కూడా టీజర్ చూసేయండి..
అయితే ఈ సినిమాకు మొదట పార్ట్ 2 చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే దీనికి ప్రీక్వెల్ పార్ట్ 1 తీస్తారట. ఇలా పార్ట్ 1 తీయకుండా పార్ట్ 2 మొదట తీసి రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.