Samantha : నిర్మాతగా సమంత మొదటి సినిమా ఇదే.. టైటిల్ ఏంటంటే?.. త్వరలోనే రిలీజ్..

కొన్నాళ్ల క్రితం సమంత తన నిర్మాణ సంస్థని ప్రకటించి అందులో సినిమాలని నిర్మిస్తానని తెలిపింది.

Samantha : నిర్మాతగా సమంత మొదటి సినిమా ఇదే.. టైటిల్ ఏంటంటే?.. త్వరలోనే రిలీజ్..

Samantha Announce her First Movie as Producer

Updated On : March 15, 2025 / 5:54 PM IST

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన బిజినెస్ లు, తన హెల్త్ మీద ఫోకస్ తో సమంత బిజీగానే ఉంది. కొన్నాళ్ల క్రితం సమంత తన నిర్మాణ సంస్థని ప్రకటించి అందులో సినిమాలని నిర్మిస్తానని తెలిపింది. సమంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అని సమంత మెయిన్ లీడ్ లో ఓ సినిమాని గతంలో ప్రకటించించారు.

అయితే సమంత నిర్మాణంలో మొదటి సినిమా తాజాగా ప్రకటించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మాతగా వసంత్ మరిగంటి రాసిన కథకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

Also Read : Manchu Vishnu : తెలుగులోనే నా సినిమాని విమర్శిస్తున్నారు.. ఇదే రాజమౌళి చేస్తే ప్రశ్నించరు.. 200 కోట్లు ఇస్తా నాకు ఆస్కార్ తెప్పిస్తారా?

శుభం సినిమాలో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న శుభం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని త్వరలోనే రిలీజ్ కానుంది.

Samantha

సమంత నిర్మాతగా తెరకెక్కిస్తున్న మొదటి సినిమా శుభంలో సమంత నటించట్లేదు. సమంత తన నిర్మాణ సంస్థలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా శుభం తర్వాతే వస్తుందని సమాచారం. ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన సమంత ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అవుతుందా చూడాలి.

Also Read : Supritha : సుప్రీత హోలీ సెలబ్రేషన్స్.. ఫ్రెండ్స్ తో కలిసి..

Samantha