Manchu Vishnu : తెలుగులోనే నా సినిమాని విమర్శిస్తున్నారు.. ఇదే రాజమౌళి చేస్తే ప్రశ్నించరు.. 200 కోట్లు ఇస్తా నాకు ఆస్కార్ తెప్పిస్తారా?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన సినిమాపై వచ్చిన ట్రోల్స్ గురించి, రాజమౌళి ఆస్కార్ సాధిస్తే వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడాడు.

Manchu Vishnu : తెలుగులోనే నా సినిమాని విమర్శిస్తున్నారు.. ఇదే రాజమౌళి చేస్తే ప్రశ్నించరు.. 200 కోట్లు ఇస్తా నాకు ఆస్కార్ తెప్పిస్తారా?

Manchu Vishnu Sensational Comments on Trolls about Kannappa and RRR Movie

Updated On : March 15, 2025 / 4:48 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క‌న్న‌ప్ప‌’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌, అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్ లాల్‌, శ‌ర‌త్ కుమార్‌, మోహ‌న్ బాబు, మ‌ధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్స్ రిలీజ్ చేశారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ కానుంది. ప్రస్తుతం మంచు విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన సినిమాపై వచ్చిన ట్రోల్స్ గురించి, రాజమౌళి ఆస్కార్ సాధిస్తే వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడాడు.

Also Read : Kaalamega Karigindhi : ‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ రిలీజ్.. స్కూల్ లవ్ స్టోరీ భలే ఉందే.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాని అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాను. అన్నిట్లో పాటలు, టీజర్లు రిలీజ్ చేశాను. నా సినిమాపై నెగిటివిటీ 0.1 శాతం హిందీలో ఉంది. తమిళ్, మలయాళ, కన్నడలో 0 శాతం ఉంది. కానీ తెలుగులో మాత్రం 15 – 20 శాతం నెగిటివిటీ ఉంది. తెలుగు ఆడియన్స్ తప్పులు వెతికి, పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నారు. సినిమాని సినిమాగా చూడాలి. తప్పులు వెతికితే సినిమాని ఎంజాయ్ చేయలేరు. ఇదే రాజమౌళి తీస్తే ప్రశ్నించరు అని అన్నారు.

Also See : Nabha Natesh : నభా నటేష్ హోలీ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

అలాగే.. తెలుగువాళ్లు గర్వపడాల్సిన మూమెంట్ RRR ఆస్కార్ గెలవడం. గెలిచిన తర్వాత కూడా కొంతమంది విమర్శలు చేశారు. డబ్బులు ఖర్చుపెట్టారు, ప్రమోషన్స్ చేశారు అందుకే ఆస్కార్ వచ్చింది అన్నారు. నేను 200 కోట్లు ఇస్తాను విమర్శలు చేసిన వాళ్లకు ఆస్కార్ అవార్డు ఇప్పిస్తారా?. ఇండియా సినిమాకు డైరెక్ట్ గా ఆస్కార్ రావడం గ్రేట్. అక్కడ స్టేజిపై తెలుగు పాట వేశారు. వీటి కంటే గర్వించదగ్గ విషయం ఏంటి అవేమి ఆలోచించకుండా నెగిటివిటీ చేస్తారు అని ఫైర్ అయ్యాడు మంచు విష్ణు. దీంతో విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.