Chiranjeevi : చిరంజీవి క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్.. ఆంధ్రా-తెలంగాణలో ఏర్పాట్లు..

ఇటీవల ఒక క్యాన్స‌ర్ స్క్రీనింగ్ సెంట‌ర్ ని ప్రారభించడానికి వెళ్లిన చిరంజీవి అభిమానులు, సినీ కార్మికులు కోసం ఒక రిక్వెస్ట్ అడిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై ప్రెస్ మీట్..

Chiranjeevi Cancer Screening Test Centers in AP and Telangana

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సేవ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ అంటూ 10 ల‌క్ష‌ల యూనిట్స్ వరకు రక్తాన్ని సేకరించి అవసరమైన పేద వారికి అందజేశారు. ఇక ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మంది వరకు కార్నియా మార్పిడికి దోహద పడి చూపులేని వారికి చూపు వచ్చేలా చేశారు. అలాగే క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు విరాళాల‌ను సేక‌రించి ఎంతోమంది కుటుంబాలకు సహాయపడ్డారు. ఇక ఈమధ్య ఒక డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ప్రారభించడానికి వెళ్లగా.. అక్కడ పరీక్షకులు చేయించుకునేలా సినీ కార్మికులకు 50 శాతం రాయితీని అడిగి తన గొప్ప మనసు చాటుకున్నారు.

Arjun Das : OG మూవీలోని కొన్ని సీన్స్ చూశా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ఫైర్ స్ట్రోమ్ కమ్మింగ్!

ఇక కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్స‌ర్ స్క్రీనింగ్ స్కాన్ సెంట‌ర్ ని ప్రారభించగా అక్కడ కూడా తన అభిమానులు కోసం ఒక రిక్వెస్ట్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం భారిన పడుతున్నారు. దానిని ముందుగా గుర్తించాలన్న ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహించామని, వాటికి అయ్యే ఖర్చులు తానూ భరిస్తాను అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్ గురించి చిరంజీవి మీడియాకి తెలియజేశారు.

Ram Charan : మెగా ప్రిన్సెస్‌తో రామ్ చరణ్ వీడియో చూశారా.. నెట్టింట వైరల్!

చిరంజీవి, డాక్టర్ గోపిచంద్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “క్యాన్సర్ కు సంబంచిన టెస్టులను అభిమానులు, సినీ వర్కర్స్ కు చేయించాలని కోరిన వెంటనే గోపిచంద్ గారు ఏర్పాటు చేశారు. జూలై 9న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కాన్సర్ టెస్టులు చేస్తారు. రోజుకు వేయి మందికి చొప్పున అన్ని రకాల కాన్సర్ టెస్టులు చేస్తారు. రెండు మూడు రోజుల్లో సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఈ విషయాన్ని చర్చిస్తాం. ఈ క్యాన్సర్ స్క్రినింగ్ కోసం ప్రత్యేక కార్డులు జారీ చేస్తాం. జులై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం” అని తెలియజేశారు.