Chiranjeevi celebrates his mother Anjana Devi birthday photos gone viral
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో గత కొంతకాలంగా ఆనందాల జాతర జరుగుతూ వస్తుంది. ఒక శుభవార్త తరువాత మరో శుభవార్తతో మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటుంది. ఇక తాజాగా చిరంజీవి భారతీయ రెండో అతిపెద్ద సివిలియన్ అవార్డు ‘పద్మవిభూషణ్’కి ఎంపిక అయిన సంగతి తెలిసిందే. దీంతో మెగా హీరోలు, అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇక ఈ ఆనంద సమయంలో చిరంజీవి తల్లి అంజనీ దేవి పుట్టినరోజు రావడంతో మెగాస్టార్.. తన అమ్మ పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకునే దానికంటే మరింత ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ అంజనీ దేవితో కేక్ కట్ చేయించి పుట్టినరోజుని జరిపారు. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో చిరంజీవి చెల్లెల్లు, సతీమణి సురేఖ మాత్రమే కనిపించారు. మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ కనిపించలేదు.
Also read : Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..
ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అమ్మ అంజనీ దేవికి మరోసారి విషెస్ తెలియజేసారు. “కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.?? pic.twitter.com/MFOttIdoPj
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024
ఇది ఇలా ఉంటే, చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక అయ్యినందుకు.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ అభినందన సభ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దిల్ రాజు ఈ విషయాన్ని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తెలియజేసారు. ఇండస్ట్రీలో ఉన్న ఇతర పెద్దలందర్నీ చరించి ఆ అభినందన సభని ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ఆ ఈవెంట్ డేట్ ని కూడా ప్రకటిస్తామంటూ దిల్ రాజు పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఈవెంట్ జరిగితే, మెగా హీరోలతో పాటు టాలీవుడ్ లోని చాలామంది హీరోలను ఒకే వేదిక పై చూడొచ్చు.