Virupaksha : చిరు ఇంట విరూపాక్ష సక్సెస్.. కేక్ పై చిరు రాయించిన పేరు భలే ఉంది..

విరూపాక్ష విజయం సాధించడం చిరు తన ఇంటిలో సాయి ధరమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించాడు. అయితే ఆ కేక్ పై చిరు రాయించిన పేరు..

Chiranjeevi celebrating sai dharam tej Virupaksha success

Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ నుంచి రికవర్ అయ్యాక నటించిన సినిమా విరూపాక్ష. ఈ మూవీ నేడు (ఏప్రిల్ 21) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఆల్రెడీ చిత్ర యూనిట్ అంతా కలిసి సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకోగా, ఆ సెలబ్రేషన్ సాయి ధరమ్ చిరంజీవి (Chiranjeevi) ఇంటిలో కంటిన్యూ చేస్తున్నాడు.

Virupaksha : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టేసిన విరూపాక్ష.. థియేటర్లలో భయపడుతున్న ప్రేక్షకులు.. ట్విట్టర్ రివ్యూ..

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయి ధరమ్ చేసిన మూవీ కావడం, టాక్ కూడా సూపర్ హిట్ అని వినిపిస్తుండడంతో మెగా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీంతో చిరంజీవి తన ఇంటిలో సాయి ధరమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించాడు. అందుకు సంబంధించిన ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అయితే చిరంజీవి ఆ కేక్ పై Sai DharaM Tej 2.0 అని పేరు రాయించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. థియేటర్ లో సినిమా ఆడియన్స్ ని భయపెడుతుందట. ఎక్కడ బోర్ కలగలేదని ఆడియన్స్ చెబుతున్నారు. దర్శకుడు కార్తీక్ మంచి డెబ్యూట్ ఇవ్వడమే కాకుండా సాయి ధరమ్ తేజ్ కి గ్రాండ్ కమ్ బ్యాక్ కూడా ఇచ్చాడు అంటున్నారు ప్రేక్షకులు.