Chiranjeevi : మరోసారి ఇండైరెక్ట్‌గా డైరెక్టర్స్‌కి క్లాస్ పీకిన చిరంజీవి.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డైరెక్టర్ గురించి చెప్తూ..

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ చిరంజీవి ఈవెంట్లో ఇండైరెక్ట్ గా డైరెక్టర్స్ కి మరోసారి క్లాస్ పీకారు.

Chiranjeevi : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) – మానుషీ చిల్లర్ జంటగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine) మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్, ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. నిన్న హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు.

ఈ ఈవెంట్లో చిరంజీవి మొదట సినిమా గురించి, వరుణ్ గురించి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గొప్పదనం గురించి మాట్లాడారు. అనంతరం ఇండైరెక్ట్ గా డైరెక్టర్స్ కి మరోసారి క్లాస్ పీకారు. గతంలో ఆచార్య సినిమా పరాజయం పాలైన దగ్గర్నుంచి పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో డైరెక్టర్స్ బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న డేస్ లో సినిమా తీయాలి, ఎడిటింగ్ లో తీసేసే సీన్స్ ఎక్కువగా ఉండకూడదు, ముందే అంతా చూసుకోవాలి, నిర్మాతలకు నష్టం కలుగకూడదు అంటూ పలుమార్లు డైరెక్టర్స్ కి క్లాస్ పీకారు చిరంజీవి.

తాజాగా ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా విజువల్స్ చూసి ఇది భారీ బడ్జెట్ సినిమా, చాలా రోజుల పాటు షూటింగ్ చేశారు అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన బడ్జెట్ కి, ఇక్కడ విజువల్స్ కి పొంతనే లేదు. అంత తక్కువ బడ్జెట్ లో కేవలం 75 రోజుల్లో డైరెక్టర్ శక్తి ఈ సినిమాని ఇంత అద్భుతంగా పూర్తిచేశారని చెప్పారు. అది విని నాకు ఆశ్చర్యమేసింది. ఇది కదా డైరెక్టర్స్ కి ఉండాల్సింది, సినిమా అనుకున్న బడ్జెట్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం, తక్కువ డేస్ లోనే షూటింగ్ పూర్తి చేసి నిర్మాతలకు సపోర్ట్ గా ఉండటం డైరెక్టర్స్ శక్తి నుంచి నేర్చుకోవాలి అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్ గా చిరంజీవి డైరెక్టర్స్ కి మరోసారి క్లాస్ పీకారని, ఆచార్య కొరటాల శివ ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటకి రాలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ట్యాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్..

ఇక ఈ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఇచ్చిన కౌంటర్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రెనైసెన్స్ పిక్చర్స్ సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు