‘మీ కుటుంబానికి మీరే సర్వస్వం’.. పవన్ అభిమానుల మృతిపట్ల చిరు సంతాపం..

  • Publish Date - September 2, 2020 / 02:49 PM IST

Chiranjeevi Response about Pawan Kalyan Fans: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు ఫ్లెక్సీ కడుతుండగా జరిగిన ప్రమాదంలో సోమ‌శేఖ‌ర్‌(29), అరుణాచ‌లం(20), రాజేంద్ర(31) మరణించారు.



విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం’’.. అంటూ చిరు సంతాపం తెలియజేశారు.