Chiranjeevi: తనకిష్టమైన రాజకీయ నాయకుడు ఎవరనేది బయటపెట్టిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్‌ఫాదర్" ఈ దసరాకు విడుదలయ్యి అదిరిపోయే హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్లు పరం గాను ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ చాలా ఆసక్తికర విషయాలని బయటపెట్టాడు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” ఈ దసరాకు విడుదలయ్యి అదిరిపోయే హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్లు పరం గాను ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. మొదటి వారం పూర్తీ అయ్యేసరికి ఈ సినిమా రూ.100 కోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఒక నిశ్శబ్దపు విస్ఫోటనం క్రియేట్ చేస్తున్నాయి.

Chiranjeevi : సల్మాన్ పాత్రకి మొదట పవన్ కళ్యాణ్ ని అనుకున్నాం.. కానీ..

ఇక సినిమా సక్సెస్ మీట్ ఇటీవల మూవీ టీం నిర్వహించగా, ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ చాలా ఆసక్తికర విషయాలని బయటపెట్టాడు. గతంలో గాని, ఇప్పుడు గాని మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని పూరీ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు.

చిరంజీవి బదులిస్తూ.. ప్రస్తుత రాజకీయంలో నచ్చిన నాయకుడు అంటే నా దగ్గర జవాబు లేదు. కానీ గతంలో అంటే భారతదేశ రెండో ప్రధానమంత్రిగా చేసిన “లాల్ బహాదుర్ శాస్త్రి” గారు అంటే తనకి ఎంతో ఇష్టమని, ఆ తరువాత కాలంలో “అటల్ బిహారీ వాజపేయి” గారు ఇష్టమంటూ తన మనసులోని మాట బయట పెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు