Chiranjeevi : సల్మాన్ పాత్రకి మొదట పవన్ కళ్యాణ్ ని అనుకున్నాం.. కానీ..
ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు, దానికి మీరేమంటారు అని పూరి జగన్నాధ్ అడగ్గా చిరంజీవి దీనికి సమాధానమిస్తూ.............

Chiranjeevi thoughts pawan kalyan in god father for salman charecter
Chiranjeevi : చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల దసరాకి రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. చిరంజీవికి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లని కూడా దాటింది ఈ సినిమా. చిరంజీవి చాలా రోజుల తర్వాత ఇంతటి భారీ విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సక్సెస్ ఇంటర్వూస్ ఇస్తున్నారు. తాజాగా చిరంజీవితో పూరి జగన్నాధ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పూరి పలు ప్రశ్నలు అడగగా చిరంజీవి వాటికి సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు, దానికి మీరేమంటారు అని పూరి జగన్నాధ్ అడగ్గా చిరంజీవి దీనికి సమాధానమిస్తూ.. ”సల్మాన్ ఖాన్ చేసిన పాత్రలో కల్యాణ్ కనిపించినా బాగుంటుంది. మేము ఆ ఆప్షన్ కూడా అనుకున్నాము. నేను చేయమని అడిగితే పవన్ కళ్యాణ్ కూడా కాదనడు. కానీ ఇతర భాషల్లో, బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ కోసం అయినా వేరేవాళ్లని తీసుకోవాలి. అందుకే సల్మాన్ ఖాన్ ని తీసుకున్నాం. సల్మాన్ కూడా చరణ్ అడగ్గానే వెంటనే ఒప్పుకున్నాడు” అని చెప్పారు.
Kiara Advani-Siddharth Malhotra : బాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో జంట??
ఈ విషయం తెలియడంతో పవన్, మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ ని తీసుకొని ఉంటే బాగుండేదని, వీరిద్దర్నీ మరోసారి స్క్రీన్ మీద చూసేవాళ్లమని అనుకుంటున్నారు.