Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో నటుడు గబ్బర్ సింగ్ రమేష్.. అండగా నిలిచిన మెగాస్టార్..

చికిత్స కోసం డబ్బులు కావాల్సి రావడంతో ఈ విషయాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్లారు పలువురు నటులు. దీంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు.(Chiranjeevi)

  • Published on- July 26, 2026 / 11:40 AM IST

Chiranjeevi

Chiranjeevi : గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నటుడు రమేష్. ఆ తర్వాత నటుడిగా, కమెడియన్ గా అనేక సినిమల్లో నటించాడు. ఇటీవల రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. వైద్యులు సమస్య సీరియస్ గా ఉందని తెలిపి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ రమేష్ ని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.

చికిత్స కోసం డబ్బులు కావాల్సి రావడంతో ఈ విషయాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్లారు పలువురు నటులు. దీంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు.

Also Read : Deewana : రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీ.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

రమేష్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి రమేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా చూడమని చెప్పారు. అంతే కాకుండా రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి చికిత్స ఖర్చుల కోసం రమేష్ సతీమణికి తన తరఫున 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తానని చిరంజీవి గారు రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో మరోసారి చిరంజీవిని అభినందిస్తున్నారు.

అలాగే.. నిన్న నాగబాబు కూడా రమేష్ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు.