Chiranjeevi Birthday Special : మెగాస్టార్ కెరీర్‌లో ఇది చాలా మాములు విషయం.. కానీ ప్రతిసారి చిరంజీవి ఇచ్చిన సమాధానం..

మెగాస్టార్ కెరీర్‌లో ప్లాప్ లు ఎదురవ్వడం చాలా మాములు విషయం. కానీ ప్లాప్ ఎదురైనా ప్రతిసారి చిరంజీవి ఇచ్చిన సమాధానం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రీ సౌండ్ లో పేలుతూ వచ్చింది.

Chiranjeevi hits and flops in career from 1990 to 2023

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి హీరో అవ్వాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఛాలెంజ్ లు ఎదురుకొని తన నటనతో ప్రేక్షకుల మనసులను దొంగలించి ఖైదీ అనిపించుకున్నప్పటికీ ఇండస్ట్రీలో ఇంద్రసేనుడిగా సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు పాన్ ఇండియా, గ్లోబల్ ఇమేజ్స్ ని సొంతం చేసుకుంటున్నప్పటికీ చిరంజీవి స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోతున్నారు.

Pawan Kalyan : చిరుకి చిన్న తమ్ముడి విషెస్.. అన్నయ్య గురించి పవన్ ఏమన్నారో తెలుసా?

ఇది ఇలా ఉంటే, ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన ఒకటిరెండు సినిమాల రిజల్ట్స్ చూసి చాలా మంది ఆయనని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అది చూసిన కొంతమంది మెగాభిమానులు బాధ పడుతున్నారు. అయితే మెగాస్టార్ కెరీర్‌లో ఇలా ప్లాప్ లు ఎదురవ్వడం చాలా మాములు విషయం. కానీ ప్లాప్ ఎదురైనా ప్రతిసారి చిరంజీవి ఇచ్చిన సమాధానం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రీ సౌండ్ లో పేలుతూ వచ్చింది. చిరంజీవి కెరీర్ లో ఒడిదుడుకులు గురించి మాట్లాడాలంటే చాలా స్టడీ చేసి ఉండాలి.

కాబట్టి నేను సింపుల్ గా 1990 నుంచి చెప్పేస్తాను. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమ సింహం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తరువాత రాజా విక్రమార్క జస్ట్ ఓకే అనిపించింది. ఆ తరువాత వచ్చిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి భారీ ప్లాప్ ని అందుకుంది. అయితే ఆ డిజాస్టర్ సౌండ్ ని గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమాల రీ సౌండ్ తో వినిపించకుండా చేశాడు. ఈ హిట్స్ తరువాత ఆపద్బాంధవుడు రూపంలో వచ్చిన ప్లాప్ ని ముఠామేస్త్రి బ్లాక్ బస్టర్ తో బ్యాలన్స్ చేశాడు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్‌లో..

ఇక సినిమా తరువాతే చిరంజీవి తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేస్ చూశాడు. మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఎస్ పి పరుశురాం, అల్లుడా మజాకా, బిగ్ బాస్, రిక్షావోడు.. ఆడియన్స్ ని నిరాశ పరుస్తూ వచ్చాయి. దీంతో ఈసారి చిరంజీవి కూడా డైలమాలో పడ్డాడు. దీంతో దాదాపు 10 నెలలు వరకు ఎటువంటి సినిమాని ఓకే చేయలేదు. ఈ గ్యాప్ లో చిరంజీవి పని అయ్యిపోయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి.

అయితే వాటన్నటికి హిట్లర్ వంటి ఎమోషనల్ సినిమాతో గట్టి సమాధానం చెబుతూ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చిరంజీవి కెరీర్ లో దీని కూడా ఒక రీ ఎంట్రీగా చెబుతుంటారు. ఇక ఆ తరువాత వచ్చిన మాస్టర్ జస్ట్ ఓకే అనిపించినా బావగారు బాగున్నారా, చూడాలని ఉంది సినిమాలతో సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు వంటి ఫ్రెండ్ స్టోరీ చిత్రాలతో వచ్చి మెప్పించలేకపోయాడు. కానీ వెంటనే అన్నయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

Vijay Deverakonda : ఖుషి ప్రమోషన్స్‌లో రష్మిక గురించి విజయ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. తనతో కలిసి..!

ఈ చిత్రం తరువాత మృగరాజు, శ్రీమంజునాథ, డాడీ సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్ ని అందుకున్నాడు. కానీ ఆ తరువాత ఇంద్ర, ఠాగూర్ సినిమాలతో ఇండస్ట్రీ లెక్కలు అన్ని మార్చేశాడు. ఈ హిట్స్ తరువాత అంజి, శంకర్ దాదా ఎంఎంబిఎస్, అందరివాడు, జైచిరంజీవ, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్.. ఆడియన్స్ ముందుకు రాగా ఎంఎంబిఎస్ ఒకటి సూపర్ హిట్టుగా నిలిచింది. జిందాబాద్ తరువాత పాలిటిక్స్ లోకి వెళ్లిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 తో 150 కోట్లకు పైగా అందుకొని టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ తనదే అని మరోసారి నిరూపించాడు.

రీ ఎంట్రీ సినిమా కాబట్టి కలెక్షన్స్ 150 కి పైగా వచ్చాయి అంటూ సైరా, ఆచార్య, గాడ్‌ఫాదర్ కలెక్షన్స్ చూపిస్తూ చిరుని విమర్శిస్తుంటే.. వాల్తేరు వీరయ్య సినిమాతో 220 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని మరోసారి గట్టి సమాధానం ఇచ్చాడు. అయితే తాజాగా వచ్చిన భోళా శంకర్ రిజల్ట్ విషయంలో చిరంజీవి పై ట్రోల్స్ శృతిమించి వస్తున్నాయి. ఈసారి మెగాభిమానులు కూడా ఈ ట్రోల్స్ కి చాలా బాధ పడ్డారు. అయితే ఎప్పటి లాగానే చిరంజీవి ఇచ్చే సమాధానం రీ సౌండ్ లో పేలడం ఖాయం.

 

ట్రెండింగ్ వార్తలు