Chiru
Chiranjeevi : ఇటీవల ‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని సాధించారు సుకుమార్. సుక్కు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే తాజాగా సుక్కు మెగాస్టార్ ని డైరెక్ట్ చేశారు. ఇదేంటి వీళ్లిద్దరు సినిమా ఎప్పుడు అనౌన్స్ చేశారు అని ఆలోచిస్తున్నారా?? వీళ్లిద్దరు కలిసి వర్క్ చేసింది ఓ యాడ్ కోసం. ఇటీవల మన స్టార్ డైరెక్టర్స్ చాలామంది సినిమా డైరెక్షన్ తో పాటు యాడ్స్ డైరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సుకుమార్ ఓ యాడ్ డైరెక్షన్ చేశారు. ఈ యాడ్ లో చిరంజీవి నటించగా అలా చిరుని సుకుమార్ డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.
Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!
ఈ యాడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలని చిరంజీవి తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు, యాడ్ కి సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ..”దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం వారి దర్శకత్వంలో షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు” అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇవే ఫోటోలు సుకుమార్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు. pic.twitter.com/3iZmcyLmvy
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2022