Chiranjeevi
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్థాయికి ఎదిగి తండ్రికి తగ్గ కొడుకు అని ఎప్పుడో అనిపించుకున్నాడు. కొడుకు సక్సెస్ చూసి మెగాస్టార్ చిరంజీవి ప్రతిసారి సంతోషిస్తారు. చరణ్ కూడా తండ్రి గౌరవాన్ని ఎక్కడా తగ్గనీయడు. తాజాగా చిరంజీవి చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.(Chiranjeevi)
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హిట్ సినిమాలో ఒకటైన, ఎంతో స్పెషల్ సినిమా అయిన కొదమ సింహం నవంబర్ 21న రీ రిలీజ్ కానుంది. కృష్ణ తర్వాత టాలీవుడ్ చిరంజీవే ఈ సినిమా ద్వారా కౌ బాయ్ వేషం వేసి మెప్పించాడు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి సినిమాతో తనకున్న జ్ఞాపకాలు మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also See :Kajal Aggarwal : భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్.. క్యూట్ ఫొటోలు చూశారా?
చిరంజీవి కొదమ సింహం గురించి మాట్లాడుతూ.. కృష్ణ గారు కౌ బాయ్ గా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చేయడం అంటే సాహసమే. నిర్మాత కైకాల నాగేశ్వరరావు ఓ కౌబాయ్ కథ ఉందని, అది మీతోనే చేయాలని డైరెక్టర్ మురళీ మోహన్ రావును తీసుకొచ్చారు. కథ నాకు నచ్చడంతో వెంటనే ఆ సినిమా చేశాను. మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో స్టిల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మొదటిసారి క్లీన్ షేవ్ కాకుండా గడ్డంతో చేసిన సినిమా ఇది. ఈ సినిమా నాకంటే చరణ్ కి ఎక్కువ ఇష్టం. అప్పట్లో రామ్ చరణ్ చిన్నప్పుడు వాళ్లమ్మ కొదమ సింహం సినిమా క్యాసెట్ పెడితే కానీ భోజనం చేసేవాడు కాదు అని తెలిపారు. దీంతో చరణ్ ఫేవరేట్ సినిమాల్లో కొదమ సింహం ఒకటి అని తెలుస్తుంది. చిరు చరణ్ గురించి మాట్లాడిన ఈ మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
#RamCharan Garu Favourite Movie #KodamaSimham Re-Release on 21st 🔥💥
Mega Cowboy invites you to experience the madness🤠💥💥
Book Your Tickets Right now #Chiranjeevi pic.twitter.com/rBMan1ZolG
— RamCharan Updates (@RCoffTeam) November 19, 2025
Also Read : I Bomma : ఓరి బాబు.. ఐ బొమ్మ పోయింది అనుకునేలోపే ఇంకో బొమ్మ.. కానీ క్లిక్ చేస్తే..