Hanuman : హనుమాన్ కోసం చిరంజీవి.. మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్‌కి డేట్ ఫిక్స్..

హనుమాన్ కోసం చిరంజీవి వస్తున్నారా..? మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడు..? ఎక్కడ..?

Chiranjeevi is coming for Teja sajja hanuman movie pre release event

Hanuman : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మూవీ పై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

ఈ మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్‌కి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారట. తాజాగా మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో చిరంజీవి వస్తున్నారని చెప్పకపోయినా.. మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ అని తెలియజేసి హింట్ ఇచ్చారు. సినీ వర్గాల్లో అయితే చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 7న ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ జరగబోతుంది.

Also read: Salaar vs Dunki : 12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్..? రెండిటి మధ్య తేడా ఎంత..?

కాగా ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల రిలీజయిన ట్రైలర్ క్లైమాక్స్ షాట్ లో ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు సీన్ చూపించారు. అయితే ఆ కళ్ళు చూడడానికి చిరంజీవి కళ్ళలా ఉన్నాయంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ హనుమంతుడికి పరమ భక్తుడని అందరికి తెలిసిందే. ఆ భక్తుడి రూపాని ఇప్పుడు ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం ఉపయోగించారని తెలుస్తుంది.

మరి మూవీలో చిరంజీవి రూపం నిజంగానే కనిపిస్తుందా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాలి. అలా కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైన రివీల్ చేస్తారా అనేది చూడాలి. కాగా ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.