Chiranjeevi : చిరంజీవి, కీర్తి సురేష్ పీక ఎందుకు పట్టుకున్నాడో తెలుసా..? అలా చేయమని ఆర్డర్ వేయడంతో..

భోళా శంకర్ నుంచి చిరంజీవి గతంలో 'జాం జాం జజ్జనక' సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో చిరు.. కీర్తి సురేష్ పీకని పట్టుకోవడం కనిపించింది. దానికి రీజన్ ఏంటో తెలుసా..?

  • Published On : August 6, 2023 / 06:25 PM IST

Chiranjeevi Keerthy Suresh Tamannaah funny moments in Bholaa Shankar sets

Chiranjeevi : మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి కొత్త చిత్రం భోళా శంకర్ (Bholaa Shankar). ఈ సినిమాలో తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంటే కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవి చెల్లెలుగా కనిపించనుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి గతంలో ‘జాం జాం జజ్జనక’ సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు.

Chiranjeevi : గాడ్‌ఫాదర్ తరువాత రీమేక్స్ వద్దనుకున్నా.. కానీ భోళాశంకర్ నిర్మాత ఆ కారణం చెప్పి ఒప్పించాడు..

ఆ వీడియోలో చిరు, తమన్నా, కీర్తి సరదాగా మాట్లాకుంటూ కనిపించగా, చివరిలో చిరు.. కీర్తి సురేష్ పీకని పట్టుకోవడం కనిపించింది. తాజాగా ఈ విషయం గురించి గెటప్ శ్రీను చిరుని ప్రశ్నించాడు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీను యాంకరింగ్ లో చిరు, తమన్నా, కీర్తి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కీర్తిని ఎందుకు అలా పట్టుకోవాల్సి వచ్చిందని శ్రీను ప్రశ్నించాడు.

Bipasha Basu : ఆ సమయంలో నరకం అనుభవించాను అంటున్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు..

చిరు సమాధానం..

ఒకసారి కీర్తి మాట్లాడుతూ తనకి హైదరాబాద్ లో బయట భోజనం ఇబ్బంది అవుతుందని చెప్పింది. దానికి తనతో నేను.. నన్ను అడగవచ్చు కదా ఇంటి దగ్గర నుంచి పంపిస్తాను అని చెప్పను. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా అని కీర్తి బదులిచ్చింది. ఇక అప్పటి నుంచి తనకి మా ఇంటి నుంచే భోజనం వచ్చేది. నేను మా చెఫ్ కి ఎప్పుడు ఈ కర్రీ కావాలని చెప్పింది లేదు. కానీ మధ్యాహ్నం అయ్యేపాటికి వాడు నాకు ఫోన్ చేసి కీర్తి మేడంకి ఏమి కర్రీ చేయాలని అడిగేవాడు.

అరే బాబు నాకేమి తెలుసారా ఏదోకటి చేయరా అని చెప్పేవాడిని. కీర్తి వెజిటేరియన్ దీంతో వాడే కొన్ని వంటలు చెప్పి అవి చేసి పంపించాడు. అవి తిని ఊరుకోకుండా దానిలో ఇది తక్కువ అయ్యింది, అందులో అది తక్కువ అయ్యింది. అది చెప్పమని చెప్పి రేపు బాగా చేసుకు రమ్మని చెప్పింది. ఆ మాటలకి నేను.. నీకేమన్నా హోటల్ సెర్వర్ లా కనిపిస్తున్నానా ఆర్డర్లు వేస్తున్నావు అని అడిగితే.. రేపు ఏమి వంటలు చేయించి పంపిస్తారు అని బదులిచ్చింది. అందుకే కోపం వచ్చి పీక పట్టుకున్నా.