Chiranjeevi : గాడ్‌ఫాదర్ తరువాత రీమేక్స్ వద్దనుకున్నా.. కానీ భోళాశంకర్ నిర్మాత ఆ కారణం చెప్పి ఒప్పించాడు..

గాడ్‌ఫాదర్ తరువాత చిరంజీవి రీమేక్స్ వద్దనుకున్నాడట. కానీ నిర్మాత అనిల్ సుంకర ఒక కారణం చూపించి చిరుని భోళాశంకర్ రీమేక్ కి ఒప్పించాడట. ఆ కారణం ఏంటో తెలుసా..?

Chiranjeevi : గాడ్‌ఫాదర్ తరువాత రీమేక్స్ వద్దనుకున్నా.. కానీ భోళాశంకర్ నిర్మాత ఆ కారణం చెప్పి ఒప్పించాడు..

Chiranjeevi make remake of Vedalam as Bholaa Shankar on that reason

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర నుండి వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ ఒక విషయం మాత్రం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అది మరేంటో కాదు ‘రీమేక్స్’. రీ ఎంట్రీ ఇస్తూనే తమిళ్ మూవీ ‘కత్తి’ని ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేశాడు. ఆ తరువాత మళియాల మూవీ ‘లూసిఫర్’ని గాడ్‌ఫాదర్ గా రీమేక్ చేశాడు. ఇప్పుడు మరో తమిళ్ మూవీ ‘వేదాళం’ని భోళా శంకర్ (Bholaa Shankar) గా రీమేక్ చేస్తున్నాడు. రీ ఎంట్రీ తరువాత 6 సినిమాలు చేస్తే, వాటిలో మూడు రీమేక్స్.

Mahesh Babu : AI టెక్నాలజీ గురించి 2019 లోనే మహేష్ బాబు చెప్పాడా..? వీడియో వైరల్..!

దీంతో ఆడియన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడంతోనే గాడ్‌ఫాదర్ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్క్ కాలేకపోయింది. ఆ మూవీతో చిరంజీవి కూడా విషయం అర్థమైంది. ఓటీటీ రావడంతో ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజ్స్ మూవీస్ ని చూసేస్తున్నారని. దీంతో గాడ్‌ఫాదర్ తరువాత మరో మూవీ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. కానీ భోళా శంకర్ రీమేక్ చేయాల్సి వచ్చింది. అందుకు కారణం నిర్మాత అనిల్ సుంకర ఒక కారణం చూపించి చిరుని ఒప్పించాడట.

Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా? సినిమాల్లోకి రాకముందు సంపూ జీతం ఎంత?

లూసిఫర్ సినిమాని చాలా మంది ఓటీటీలో చూడడమే కాకుండా, తెలుగు డబ్బింగ్ తో కూడా ఆ మూవీ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యింది. అందువలనే గాడ్‌ఫాదర్ వర్క్ అవుట్ అవ్వలేదని, కానీ వేదాళం మూవీ తెలుగు ఆడియన్స్ లో పెద్దగా రీచ్ అవ్వలేదని చెప్పి భోళాశంకర్ మూవీని ఒప్పించాడట. దీని వలనే చిరు ఈ రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ తరువాత చిరంజీవి మలయాళ మూవీ ‘బ్రో డాడీ’ని కూడా రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తలో నిజమెంతో తెలియదు.