చిరంజీవి గుండుపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

  • Publish Date - September 11, 2020 / 03:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి లెటెస్ట్ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఆయన నున్నగా గుండుగా కనిపంచడమే ఇందుకు కారణం. ఎప్పుడూ గుండుగా కనిపంచని చిరంజీవిని చూసి అభిమానులు నోరెళ్ల బెట్టారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.




గుండు బాస్ గా పిలుచుకునే…కిరణ్ కుమార్ (లలితా జ్యువెల్లర్) ను గుర్తుకు తెస్తున్నారు. డబ్బులు ఊరికే రావు..అంటూ ప్రకటనల్లో ఈయన చెప్పే డైలాగ్ తెగ పాపులర్ అయ్యింది. బాస్ గుండు బాస్ అంటూ సరదాగా పోస్టులు చేస్తున్నారు.
https://10tv.in/bell-bottom-unveils-akshay-kumars-new-retro-look/
న్యూ లుక్ అదిరపోయిందని ఒకరు..వావ్ క్రేజీ లుక్ చిరు సార్..బాస్ సర్..బాస్ అంతేనంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు ఏ లుక్ లో ఉన్నా…తమకు మెగాస్టార్ అంటున్నారు.




‘ఆచార్య’ మూవీ తర్వాత మలయాళంలో మూవీ ‘లూసీఫర్’ రీమేక్‌, అలాగే తమిళంలో వచ్చిన ‘వేదాలం’ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ మూవీకి తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు. కానీ..ప్రస్తుతం కరోనా కారణంగా ఏ సినిమా షూటింగ్ జరగడం లేదు.

అయితే..చిరంజీవి గుండు ఎందుకు కొట్టించుకున్నారో అంటూ తెగ చర్చించుకుంటున్నారంట మెగా ఫ్యాన్స్. ఆచార్య సినిమా కోసమేనంటున్నారు కొంతమంది.