Chiranjeevi Cm Jagan
Chiranjeevi-CM Jagan: వద్దు వద్దు అంటూనే మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరపున ముందుకు వెళ్తున్నారు. ఏపీలో సినినిమా టికెట్ల వివాదం.. టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో చాలాకాలంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సమస్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున మరోసారి మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ ను కలవనున్నారు. ఫిబ్రవరి 10న చిరు మరోసారి జగన్ ను కలవనున్నట్లు సినీ రాజకీయ వర్గాల నుండి అందిన సమాచారం.
Khiladi: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?
గత జనవరి నెలలో కూడా చిరు ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. జనవరి 13న జగన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న చిరు.. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. అప్పటి భేటీలో సీఎంతో చర్చించిన అంశాలపై చిరంజీవి పరిశ్రమలోని మిగతా ముఖ్యులతో సోమవారం సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. కానీ.. అది సోమవారం నుండి మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం భేటీలో చిరు.. జగన్ తో గత భేటీ గురించి అంశాలతో పాటు గురువారం జరగబోయే భేటీ గురించి కూడా చర్చించనున్నారు.
Samantha: సామ్ డిసిప్లైన్ కొటేషన్.. సోషల్ మీడియాలో చర్చ!
గురువారం సీఎం జగన్ తో జరగబోయే భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సినీ పరిశ్రమకి చెందిన పలువురు నిర్మాతలు, ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మరో నాలుగైదు రోజులలోనే కొత్త సినిమాల విడుదల మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారుతోంది. మరి.. ఈ రెండు భేటీలు సక్రమంగా జరిగి టికెట్ల వివాదం కొలిక్కి వస్తుందా లేదా అన్నది చూడాలి.