Samantha: సామ్ డిసిప్లైన్ కొటేషన్.. సోషల్ మీడియాలో చర్చ!

సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు..

Samantha: సామ్ డిసిప్లైన్ కొటేషన్.. సోషల్ మీడియాలో చర్చ!

Samantha

Samantha: సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తోంది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పటికే తమిళ్, తెలుగు, హిందీ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. హాలీవుడ్ లో కూడా ఒక సినిమాకి సైన్ చేసింది.

Khiladi Trailer: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్!

కెరీర్ లో ఎన్నడూ లేని దూకుడు చూపించే సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాల గురించి, ఫిట్ నెస్, ఫ్యాషన్ గురించే కాదు సైకాలజీ గురించి.. జీవితం గురించి.. పిల్లల పెంపకం గురించి కూడా కొటేషన్స్ తో లెక్చర్లు ఇచ్చేస్తుంటుంది. ఇప్పటికే అలాంటి ఎన్నో కొటేషన్లు చెప్పిన సామ్ ఇప్పుడు డిసిప్లైన్ గురించి ఇన్ స్టాలో ఒక కొటేషన్ చెప్పుకొచ్చింది.

Radhe Shyam: వాలెంటైన్స్ నైట్ థీమ్ పార్టీ.. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్!

ఏ ఒక్కరు కూడా నీకు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో చెప్పాలనుకోరు. క్రమశిక్షణ అనేది మనని మనం స్ట్రాంగ్ గా మల్చుకునేందుకు ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అనేది ప్రస్తుత ఆనందాలను తాత్కాలిక ఎంజాయ్మెంట్ ను దూరం చేయవచ్చు కాని జీవితంలో మంచి ఫలితాలు పెద్ద విజయాలు దక్కడంలో క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది అనే కొటేషన్ ను షేర్ చేసిన సమంత నిజం అన్నట్లుగా కామెంట్ పెట్టింది.

DJ Tillu: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!

సమంతా అంటేనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. ఈ మధ్య ట్రోల్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. తాజాగా ఆమె ధరించిన ఓ టీ షర్ట్ మీద బూతు కొటేషన్స్ ప్రింట్ చేయగా అది ధరించిన సామ్ ముంబై రోడ్ల మీద దర్శనమిచ్చింది. దీంతో కొందరు డ్రెస్ మీద ఏమో బూతు కొటేషన్స్.. ఇలా సోషల్ మీడియాలో నీతులు చెప్తూ కొటేషన్స్ ఏంటని కామెంట్లు చేస్తుంటే.. సామ్ చెప్పింది నిజమే డిసిప్లైన్ అనేది ఇప్పుడు చేదుగానే ఉన్నా జీవితానికి ఉపయోగపడుతుందని ఆమె అభిమానులు వెనకేసుకొస్తున్నారు.