సీఎం జగన్ అంటే..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలతో విరుచుకపడుతున్నారు. మరోపక్క సీఎం జగన్‌ను కలిసేందుకు..మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 11గంటలకు ఈ భేటీ జరుగబోతోంది. అయితే..కేవలం కలవడం మాత్రమే కాకుండా లంచ్ కూడా చేయాలని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సైరా సినిమా కోసమే చిరు కలుస్తున్నారని అనుకున్నా..వీరిద్దరి భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
చాలా రోజుల తర్వాత చిరు..జగన్‌ను కలుస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో కలిసినా..అవి ప్రైవేటు కార్యక్రమాలు కావడం పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. సీఎం జగన్ కావడం..ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో చిరు – జగన్ భేటీపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ భేటీలో పొలిటికల్ టర్న్‌లు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..అన్నయ్య చిరంజీవి..జగన్ కలుస్తండడంపై జనసేనానీ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలకు కారణమౌతుందా లేక..సినిమా ప్రమోషన్ చూసి లైట్ తీసుకుంటారా ? అనేది మెగా కుటుంబం అభిమానుల్లో, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. చిరు – జగన్ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది..తర్వాత ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది తెలుసుకోవాలంటే అక్టోబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
Read More : మెర్సీ కిల్లింగ్ : 10tv కథనంపై స్పందించిన సీఎం జగన్