Chiranjeevi : చిరంజీవి రూట్ మార్చారా? మెగా 157 ముందుకి.. మెగా 156 వెనక్కి? పూజా కార్యక్రమాలతో మొదలు

నేడు మెగా 157 సినిమాని మెగా 156 సినిమాగా మార్చారు. దీంతో ఇప్పుడు చిరంజీవి వసిష్ఠ దర్శకత్వంలోనే ముందు రాబోతున్నాడు.

Chiranjeevi Mega 156 Movie under Vassishta Direction Started

Chiranjeevi : ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన భోళాశంకర్ పరాజయం పాలయ్యాక మెగాస్టార్ పుట్టిన రోజు నాడు మెగా 156 సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా 157 సినిమా వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నట్టు ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ సినిమా ఏమో కానీ వశిష్ట సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వశిష్ట బింబిసార సినిమాతో హిట్ కొట్టాడు. మెగా 157 సినిమా కూడా సోషియో ఫాంటసీ అని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఏమైంది తెలీదు కానీ నేడు మెగా 157 సినిమాని మెగా 156 సినిమాగా మార్చారు. దీంతో ఇప్పుడు చిరంజీవి వసిష్ఠ దర్శకత్వంలోనే ముందు రాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ వీడియోని విడుదల చేశారు. అలాగే సినిమా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలుపెట్టేసారు. ఇప్పుడు వసిష్ఠ – చిరంజీవి సినిమా మెగా 156గా మారి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ పాటలు రాయనున్నారు. తాజాగా పూజా కార్యక్రమం, మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టిన వీడియోని విడుదల చేశారు. దీనికి ఒక పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈసారి మెగా మాస్ యూనివర్స్ ని దాటి అంటూ సరికొత్తగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. చిరంజీవి కొత్తగా ప్రయత్నిస్తుండటంతో మెగా 156 సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు అభిమానులు.

Also Read : Bhagavanth Kesari Success Celebrations : భగవంత్ కేసరి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

అయితే కళ్యాణ్ కృష్ణతో తీయబోయేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని, అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి రూటు మార్చి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి కొత్తదనాన్ని ప్రేక్షకులకి ఇచ్చి తర్వాత ఆ సినిమాతో రావాలి అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాని ముందు మొదలుపెట్టారని తెలుస్తుంది.