Chiranjeevi met Ali on the occasion of Ramadan
Chiranjeevi : రంజాన్ వేడుక కావడంతో టాలీవుడ్ లోని నటీనటులు సోషల్ మీడియా వేదికగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ముస్లిం సోదరులందరికి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలోని స్టార్ కమెడియన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడు అలీకి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. అలీ కుటుంబ సభ్యుల రంజాన్ పర్వదినంగా చిరంజీవిని కలిశారు.
Chiranjeevi: చిరు నెక్ట్స్ మూవీపై మరో క్రేజీ వార్త.. ఏమిటో తెలుసా?
చిరంజీవి.. అలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో కలిసి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసిన అలీ.. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, అలాగే మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని అలీ వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవితో అలీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Chiranjeevi met Ali on the occasion of Ramadan
కాగా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈ ఏడాది ఆగష్టు 11న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం శ్రియా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
Chiranjeevi met Ali on the occasion of Ramadan
Chiranjeevi met Ali on the occasion of Ramadan
Chiranjeevi met Ali on the occasion of Ramadan
Chiranjeevi met Ali on the occasion of Ramadan