Chiranjeevi: చిరు నెక్ట్స్ మూవీపై మరో క్రేజీ వార్త.. ఏమిటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళాశంకర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సిినిమా తరువాత చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi: చిరు నెక్ట్స్ మూవీపై మరో క్రేజీ వార్త.. ఏమిటో తెలుసా?

Crazy Rumours On Chiranjeevi Next Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న మెగాస్టార్ భోళాశంకర్ మూవీతో తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.

Chiranjeevi : బలగం సింగర్‌కి ఎదురెళ్లి సహాయం చేస్తున్న చిరు.. మెగాస్టార్ మనసు బంగారం!

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, చిరు తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చిరుకు కథలు వినిపిస్తున్నారు. అయితే, బింబిసార మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ ఓ కథను చిరుకి నెరేట్ చేశాడట. ఈ కథ బాగా నచ్చిన చిరు, ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిని కనబర్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి సరికొత్త వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi : భోళాశంకర్ సెట్‌లో చంద్రబోస్‌కి చిరు సత్కారం..

దర్శకుడు వశిష్ఠతో చిరు చేయబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ కూడా చిరుకి ఓ కథను వినిపించాడట. మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్‌లో చిరు ఎవరికి ఓటేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.