Chiranjeevi : బలగం సింగర్‌కి ఎదురెళ్లి సహాయం చేస్తున్న చిరు.. మెగాస్టార్ మనసు బంగారం!

చిరంజీవి సేవ గుణం అందరికి తెలిసిందే. తాజాగా మన మెగాస్టార్ బలగం సింగర్ దీనస్థితి తెలుసుకొని ఎదురెళ్లి మరి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.

Chiranjeevi : బలగం సింగర్‌కి ఎదురెళ్లి సహాయం చేస్తున్న చిరు.. మెగాస్టార్ మనసు బంగారం!

Chiranjeevi helps Balagam singer Mogilaiah eye Surgery

Updated On : April 18, 2023 / 8:20 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్ అండ్ ఫైట్స్ తోనే కాదు, తన గొప్ప మనసుతో కూడా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ ప్లాంట్.. ఇలా తనకి ఇంతటి హోదాని అందించిన ప్రజలు కోసం తనవంతు సహాయం తను చేయడానికి ముందు ఉంటాడు. తాజాగా ఇండస్ట్రీలోని ఒక సింగర్ కష్టంలో ఉన్నాడని తెలుసుకొని, ఎదురెళ్లి మరి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఇటీవల బలగం (Balagam) అనే ఒక్క సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Bhola Shankar: ‘భోళాశంకర్’లో హైలైట్ కానున్న స్పెషల్ ట్రాక్.. ఏమిటంటే?

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించాడు. దిల్ రాజు సమర్పణలో తన కూతురు ఈ సినిమాని నిర్మించింది. కాగా ఈ సినిమా చివరిలో ‘నా తోడుగా నా తోడు ఉండి’ అనే పాటని పాడిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య (Mogilaiah) ఈ చిత్రంతో మంచి పేరుని సంపాదించుకున్నాడు. అయితే కొంత కాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో బాధ పడుతూ వస్తున్నాడు. దీనితో పాటు కంటి చూపు కూడా కోల్పవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నాడు.

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి బలగం డైరెక్టర్ వేణుకి ఫోన్ చేసి.. మొగిలయ్యకు కంటి చూపు మళ్ళీ తిరిగి వచ్చేలా నేను ఆపరేషన్ చేయిస్తాను. అందుకు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని చెప్పాడట. ఈ విషయాన్ని వేణు, మొగిలయ్యకు తెలియజేశాడు. అయితే ఈ విషయం ఇటీవల మొగిలయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు మెగాస్టార్ మనసు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.