Chiranjeevi once comments on Directors now Balakrishna also comments on Directors goes viral
Chiru – Balayya : కొన్ని రోజుల క్రితం చిరంజీవి(Chiranjeevi) ఆచార్య(Acharya) సినిమా తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల సమయంలో డైరెక్టర్స్(Directors) పై కామెంట్స్ చేశారు. కొంతమంది డైరెక్టర్స్ స్క్రిప్ట్ ఫైనల్ అవ్వకుండా షూట్ కి వెళ్తున్నారని, సెట్ లో డైలాగ్స్ మారుస్తున్నారని, నిర్మాతల డబ్బులు వేస్ట్ చేస్తున్నారని కామెంట్స్ చేశారు చిరంజీవి. ఆ సమయంలో చిరు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చిరు ఏదైనా డైరెక్టర్ తో ఇలాంటి పరిస్థితులు పేస్ చేసి ఈ మాటలు అన్నాడేమో అని కామెంట్స్ వచ్చాయి.
అలాగే డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో రావాలి, ప్రేక్షకులని ఎలా థియేటర్ కి రప్పించాలి అని డైరెక్టర్స్ ఆలోచించాలని చిరంజీవి గతంలో అన్నారు. చిరు రెండు, మూడు సార్లు ఈ కామెంట్స్ చేయడంతో సంచలనంగా మారాయి. తాజాగా బాలకృష్ణ కూడా డైరెక్టర్స్ గురించి కామెంట్స్ చేశారు.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శనివారం సాయంత్రం స్కంద(Skanda) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ(Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులని థియేటర్ కి ఎలా రప్పించాలి అనే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచించాలి. ఇప్పుడు ప్రేక్షకులని సినిమా థియేటర్ కి రప్పించడం అంత ఈజీ కాదు. కొత్తదనం ఉంటేనే వస్తున్నారు. డైరెక్టర్స్ ఆ విధంగా ఆలోచించాలి. డైరెక్టర్ బోయపాటితో చేసిన గత సినిమాలను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన సినిమాలకు దేశమంతటా కాదు విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు.
Nithiin : పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా.. ‘తమ్ముడు’.. అది కూడా పవన్ డైరెక్టర్ తోనే..
దీంతో బాలయ్య దర్శక నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మొన్న చిరంజీవి, ఇప్పుడు డైరెక్టర్స్ పై కామెంట్స్ ఎందుకు చేశారు అని టాలీవుడ్ లో అంతా ఆలోచిస్తున్నారు. కొత్త కథలు, మంచి సినిమాలు రావడానికే చిరు, బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరోలు డైరెక్టర్స్ పై కామెంట్స్ చేశారా? లేక డైరెక్టర్స్ నిజంగానే నిర్మాతల డబ్బులు వేస్ట్ చేస్తున్నారా అనేది తెలియాలి. మొత్తానికి బాలయ్య కూడా ఇప్పుడు డైరెక్టర్స్ గురించి మాట్లాడటంతో దీంతో పాటు చిరంజీవి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.