Nithiin : పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా.. ‘తమ్ముడు’.. అది కూడా పవన్ డైరెక్టర్ తోనే..

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కంబ్యాక్ సినిమా వకీల్ సాబ్(Vakeel Saab) తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.

Nithiin : పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా.. ‘తమ్ముడు’.. అది కూడా పవన్ డైరెక్టర్ తోనే..

Nithin New movie announced with Pawan Kalyan movie Title Thammudu under Venu Sriram Direction

Updated On : August 27, 2023 / 8:57 AM IST

Nithiin New Movie : హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం(Macharla Niyojakavargam) సినిమాతో రాగా ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ(Vakkantham Vamsi) దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. తాజాగా నితిన్ మరో కొత్త సినిమా ఓకే చేశాడు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కంబ్యాక్ సినిమా వకీల్ సాబ్(Vakeel Saab) తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘తమ్ముడు’ అని పెట్టడం విశేషం. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Balakrishna : రామ్ ఆ సినిమా చేసి నాకు ఛాలెంజ్ విసిరాడు.. ప్రేక్షకులని థియేటర్‌కి ఎలా రప్పించాలో దర్శకనిర్మాతలు ఆలోచించాలి..

ఈ సినిమా గురించి, టైటిల్ గురించి నితిన్ తన ట్విట్టర్ లో.. కొన్ని టైటిల్స్ రెస్పాన్సిబిలిటితో కూడా అటాచ్ అయి ఉంటాయి. మీ అంచనాలని నేను ఈ సినిమాతో అందుకుంటాను అని ట్వీట్ చేశాడు. దీంతో నితిన్ కొత్త సినిమా అనౌన్స్ వైరల్ మారింది. నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అని అందరికి తెలిసిందే. తన చాలా సినిమాల్లో పవన్ రిఫరెన్స్ లు వాడుకున్నాడు. నితిన్ ఈవెంట్స్ కి పవన్ కూడా గెస్టుగా వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు పవన్ టైటిల్ తో సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.