Chiranjeevi : ఏపీ ప్రభుత్వం కోసం కీలకంగా మెగాస్టార్..? నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. (Chiranjeevi)

  • Published on- July 29, 2026 / 06:57 AM IST

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. రెండు మూడు ప్రాజెక్టులు కమిట్ అయిన చిరు నెక్స్ట్‌ సంక్రాంతి రేసులో నిలిచేందుకు తన మూవీ షూటింగ్‌ను ఫాస్ట్ గా చేస్తున్నారు. ఆయన మూవీస్‌లో బిజీగా ఉంటే చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని టాక్ బయలుదేరింది. ఇప్పుడీ ప్రచారం ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన చిరు అవేమి వద్దని వెనుకకు వచ్చేసారు. ఆ తర్వాత ఎన్నోసార్లు మళ్ళీ ఆయన పాలిటిక్స్ లోకి వస్తారు అనే వార్తలు వచ్చినా డైరెక్ట్ గానే నేను పాలిటిక్స్ లోకి రాను అని చెప్పారు మెగాస్టార్.

కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా కొత్త ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టాలీవుడ్ స్టార్ నాగార్జునను ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లే ఇప్పుడు అదే తరహాలో చిరంజీవిని కూడా ఆ పాత్రలోకి తీసుకురావాలని ఆలోచనలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గ్లోబల్ లెవెల్‌లో ఏపీ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయాలంటే చిరంజీవి లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌ అవసరమనే అభిప్రాయంతో ఉన్నట్టు టాక్.

Also Read : Telugu Actresses : పర్ఫార్మెన్స్ లతో అదరగొడుతున్న తెలుగు హీరోయిన్స్.. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా..

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామనే ప్రతిపాదన ఇప్పటికే చిరంజీవి వరకు వెళ్లిందనే గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమా కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ బాధ్యతను స్వీకరించే అవకాశాలు ఉన్నట్టు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫామ్‌ కాలేదు కానీ సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై గట్టి చర్చ నడుస్తోంది. మరి ఇది నిజమేనా లేక కేవలం ప్రచారమేనా అంటే వేచి చూడాల్సిందే.