Acharya : సంక్రాంతికి ‘ఆచార్య’ మళ్ళీ రిలీజ్.. ఎక్కడో తెలుసా? ఇప్పుడెందుకు ఆ సినిమా అంటూ మెగా ఫ్యాన్స్..

తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులు ఆచార్య సినిమా చూసి నిరుత్సాహపడ్డారు.

Chiranjeevi Ram Charan Acharya Movie Releasing on Bollywood with Dubbing Version for this Sankranthi

Acharya : కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. తండ్రి కొడుకులు ఇద్దరూ పూర్తి స్థాయిలో మొదటిసారి కలిసి నటిస్తుండటం, కొరటాల శివ అప్పటివరకు ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉండటం, అప్పుడే చరణ్ RRRతో భారీ సక్సెస్ చూసి ఉండటం.. ఇలా వీటన్నిటితో ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022 ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజయింది.

చిరు, చరణ్ కలిసి నటించడంతో మెగా ఫ్యాన్స్ వల్ల మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చినా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కేవలం 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆచార్య సినిమా భారీ నష్టంతో థియేటర్స్ నుంచి వెనుదిరిగింది. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులు ఆచార్య సినిమా చూసి నిరుత్సాహపడ్డారు. తర్వాత ఆ సినిమాని కూడా మర్చిపోయారు.

అయితే ఆచార్య సినిమా ఇప్పుడు మెగా అభిమానులని మళ్ళీ కలవరపెడుతుంది. ఈ సంక్రాంతికి ఆచార్య సినిమా బాలీవుడ్ లో డబ్బింగ్ తో రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఆచార్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న తమ యూట్యూబ్ ఛానల్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకు ఆచార్య హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఇప్పుడు మళ్ళీ ఆచార్యని ఎందుకు గుర్తు చేస్తున్నారు? రిలీజ్ చేయాలనుకుంటే సైలెంట్ గా రిలీజ్ చేసుకోవచ్చు కదా? దానికి మళ్ళీ ప్రమోషన్స్ చేయాలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ అప్పుడేనా? ఆ డేట్ బాగా కలిసొచ్చింది అని..

టాలీవుడ్ లో ఫెయిల్ అయిన ఎన్నో కమర్షియల్ సినిమాలు బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ లో భారీ సక్సెస్ చూశాయి. మరి ఆచార్య కూడా అలాగే బాలీవుడ్ యూట్యూబ్ లో సక్సెస్ చూస్తుందా? లేక ఇక్కడి రిజల్ట్ అక్కడ కూడా వస్తుందా చూడాలి.