Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ అప్పుడేనా? ఆ డేట్ బాగా కలిసొచ్చింది అని..
తాజాగా ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

Prabhas Kalki 2898AD Movie Release Date Update News goes Viral in Tollywood
Kalki 2898AD Release Date : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవలే సలార్(Salaar) సినిమాతో వచ్చి థియేటర్స్ లో సందడి చేశాడు. ఇప్పటికే కల్కి సినిమా 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత సలార్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు సలార్ పార్ట్ 1 తర్వాత ప్రభాస్ లైనప్ మరింత పెద్దగానే ఉంది. కల్కి 2898AD, ప్రభాస్ మారుతీ సినిమా, స్పిరిట్, సలార్ 2.. ఇలా ప్రభాస్ వరుస సినిమాలని లైన్లో పెట్టాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ చూసి ఈ సినిమా అయితే హాలీవుడ్ సినిమాలని మించి ఉంటుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కల్కి సినిమాని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు. 2024 సమ్మర్ కి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే ఇంకా షూటింగ్ కూడా పూర్తిగా అవ్వలేదు.
తాజాగా కల్కి సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. కల్కి సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఎన్నో ఏళ్లుగా వైజయంతి మూవీస్ గొప్ప గొప్ప సినిమాలని అందించింది. వైజయంతి మూవీస్ సంస్థ నుంచి వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి. సమ్మర్, ఆ డేట్ ఈ నిర్మాణ సంస్థకి బాగా కలిసొచ్చింది. దీంతో కల్కి లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని కూడా ఆ డేట్ లోనే రిలీజ్ చేయాలని వైజయంతి సంస్థ ప్రయత్నిస్తుంది అని సమాచారం.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను.. మరి శంకర్?
ఈ సంవత్సరం మే 9 ఎలాగో గురువారం వచ్చింది కాబట్టి సినిమా రిలీజ్ చేసే స్కోప్ కూడా ఉంది. ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది కల్కి సినిమా. మరి మే లోపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. అభిమానుల్లోనే కాక, టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కల్కి సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్, దిశా పటాని, కమల్ హాసన్.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.