Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను.. మరి శంకర్?

గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని సీన్స్ ని సైంధవ్‌ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడని తనే స్వయంగా చెప్పాడు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను.. మరి శంకర్?

Ram Charan Game Changer Movie Scenes Directed by Saindhav Director Sailesh Kolanu

Updated On : January 9, 2024 / 11:49 AM IST

Game Changer : రామ చరణ్(Ram Charan) అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో చాలా నిరాశలో ఉన్నారు. RRR సినిమా తర్వాత చరణ్ ఆచార్య సినిమాలో కనిపించాడు. ఆ సినిమా పరాజయం పాలయింది. దీంతో చరణ్ నెక్స్ట్ సినిమాపై అంతా ఆశలు పెట్టుకున్నారు. చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటిదాకా సినిమా టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు.

శంకర్ ఏమో అటు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆ సినిమా పూర్తయింది. మళ్ళీ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ మొదలుపెట్టారని సమాచారం. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకువచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని సీన్స్ ని సైంధవ్‌ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడని తనే స్వయంగా చెప్పాడు. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్‌ సినిమా ఈ సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కానుంది.

Also Read : Balakrishna : అభిమాని కోసం మోకాళ్ళ మీద కూర్చున్న బాలయ్య.. ఎంతైనా బాలయ్య బాబు బంగారం..

సైంధవ్‌ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శైలేష్ కొలను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం తెలిపాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్స్ మీరు డైరెక్ట్ చేసారని వినిపిస్తుంది అని యాంకర్ అడగ్గా శైలేష్ కొలను సమాధానమిస్తూ.. ఏ సినిమాలో అయినా నటీనటులు లేని సన్నివేశాలు, కొన్ని డ్రోన్ షాట్స్, వైడ్ యాంగిల్స్, లొకేషన్ షాట్స్.. లాంటివి డైరెక్టర్ టైం కలిసొస్తుందని తన అసిస్టెంట్స్ కి చెప్పి షూట్ తీసుకురమ్మంటాడు. శంకర్ సర్ ఇలాంటివి కూడా ఆయనే తీసుకుంటారు. కానీ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లో ఓ లొకేషన్ ముందుగానే బుక్ చేశారు, ఆ సమయానికి శంకర్ సర్ అందుబాటులోకి రాలేక వేరే వర్క్ లో ఉండాల్సి వచ్చింది. దీంతో నటీనటులు లేని షాట్స్, లొకేషన్స్ షాట్స్ కాబట్టి.. లొకేషన్ వేస్ట్ అయిపోతుంది, మనీ కూడా పెట్టారు కాబట్టి శంకర్ సర్ దిల్ రాజుకి ఈ షాట్స్ ఎవరన్నా మంచి డైరెక్టర్ తో తీయించండి అని చెప్పారు. దీంతో దిల్ రాజు గారు నాకు కాల్ చేసి అడిగితే ఓకే చెప్పాను. రెండు రోజులు ఓ లొకేషన్ లో షూట్ చేసాం. అవేమి సీన్స్ కాదు, జస్ట్ ఎష్టాబ్లిష్మెంట్ షాట్స్ లాంటివి. నేను షూట్ చేసి అవుట్ పుట్ దిల్ రాజు గారికి ఇచ్చేసాను అంతే. చిన్నప్పట్నుంచి శంకర్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయన సినిమాలో ఇలా చిన్న వర్క్ రావడం నాకు హ్యాపీగా అనిపించింది. గేమ్ ఛేంజర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 సెప్టెంబర్ లో లేదా దసరాకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ గేమ్ ఛేంజర్ లొకేషన్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు, అందుకే ఈ అవకాశం శైలేష్ కొలనుకి వచ్చినట్టు తెలుస్తుంది.