Mega Family : ఇటలీ నుంచి మెగా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన ఉపాసన..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన మెగా ఫ్యామిలీ అక్కడి నుంచి తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

Chiranjeevi Ram Charan Upasana Photos at Varun Tej Lavanya Tripathi Wedding

Mega Family : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు మూళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలో జరగబోతున్న ఈ పెళ్లి కోసం వధూవరులతో పాటు మెగా కుటుంబసభ్యులు, బంధులు అక్కడికి చేరుకున్నారు. ఇక అక్కడి ఫోటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అక్కడి నుంచి ఒక మెగా ఫ్యామిలీ పిక్ ని ఉపాసన షేర్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ ఫొటోలో మెగా, కామినేని కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు, రామ్ చరణ్ ఉపాసన, క్లీంకార, ఉపాసన అమ్మానాన్నలు అందరూ ఆ ఫోటోలు కనిపిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్, లావణ్యలు కూడా ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. కాఫీ తాగుతున్న లావణ్య పిక్ ని వరుణ్, రెయిన్ బోతో లావణ్య, వరుణ్ ని క్యాప్చర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Varun Lavanya Sangeet Party : వరుణ్ లావణ్య సంగీత్ ఫోటోలు లీక్.. చరణ్, అల్లు అర్జున్ సందడి..

ఇక ఈ మెగా వివాహ షెడ్యూల్ విషయానికి వస్తే.. నాలుగు రోజుల పాటు జరగనుంది. అక్టోబర్ 30 రాత్రి సంగీత్ పార్టీ, అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక, నవంబర్ 1న పెళ్లి వేడుక జరగనుంది. అనంతరం హైదరాబాద్ లో నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు హాజరవ్వనున్నారు.