Chiranjeevi : ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో.. చిరంజీవి రిఫరెన్స్..

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో రిలీజైన సినిమాల్లో చిరంజీవి రిఫరెన్స్ ఉంది. ఒక్క సైంధవ్ లో తప్ప మిగిలిన మూడు సినిమాల్లో..

Chiranjeevi reference in Guntur Kaaram Naa Saami Ranga Hanuman Movies

Chiranjeevi : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు ఈ పండక్కి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే ఈ రిలీజైన మూడు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ లు ఉన్నాయట. ఒక్క సైంధవ్ లో తప్ప మిగిలిన మూడు సినిమాల్లో చిరంజీవి రిఫరెన్స్ కనిపిస్తుందట. అవేంటో చూసేయండి.

గుంటూరు కారం..
గుంటూరు కారం సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో మహేష్ బాబుని పోలీసులు తన బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రశ్నిస్తారు. దానికి మహేష్ బదులిస్తూ.. “నాకు ఎవరు లేరు. స్వయంకృషిలో చిరంజీవిలా సొంతంగా పైకి ఎదిగాను” అంటూ చెప్పుకొస్తారు. ఇక మహేష్ నుంచి చిరు పేరు రావడంతో థియేటర్ లో ఈ డైలాగ్ సమయంలో రీసౌండ్ వచ్చింది.

Also read : Ram Charan : రామ్ చరణ్ కూతురి ‘క్లీంకార’పై సాంగ్ రిలీజ్.. అభిమానులు చేసిన ఆ పాట విన్నారా..

నా సామిరంగ..
90s బ్యాక్‌డ్రాప్ లో సాగిన ఈ మూవీలో కొన్ని థియేటర్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి ఓ థియేటర్ సీన్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి చిరంజీవి ‘మంచి దొంగ’ సినిమాకి వెళ్తారు. సుప్రీమ్ హీరో చిరంజీవి అభిమానులుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. థియేటర్ బయట హంగామా చేస్తారు. థియేటర్ బయట కట్ అవుట్స్ తో చిరు బ్యానర్స్ తో మెగాస్టార్ రిఫరెన్స్ కనిపిస్తుంది.

హనుమాన్..
ఇక చివరిగా తేజ సజ్జ సూపర్ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాలో కూడా చిరు రిఫరెన్స్ కనిపించింది. ఈ మూవీలో రామభక్త హనుమంతుడిని గ్రాఫిక్స్ లో చూపించి ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించారు మేకర్స్. మూవీలో హనుమాన్ ఫేస్ ని ఫుల్ గా చూపించలేదు. కేవలం హనుమంతుడి కళ్ళుని మాత్రమే పవర్ ఫుల్ గా ప్రెజెన్స్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. అయితే ఈ కళ్ళని గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయడానికి చిరంజీవి కళ్ళని ఉపయోగించుకున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చెప్పకపోయినా అది నిజం అన్నట్లే పేర్కొన్నారు.