RRR : నేను ఆస్కార్‌కి గెస్ట్‌గా మాత్రమే వెళ్ళాను.. కానీ నేడు చరణ్ అండ్ తారక్.. చిరంజీవి!
ప్రపంచం మొత్తాన్ని ఊర్రుతలుగించన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ తో పాటు పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంటూ నేడు ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. దీంతో చిరంజీవి తన ఆనందాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
- gum 95921
- Published On : March 13, 2023 / 12:53 PM IST
chiranjeevi said once upon a time he is just guest in oscar but now ntr and ram charan are winners in oscar
RRR : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇక ఈ ఏడాది ఆస్కార్స్ కి భారతదేశం తరుపు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘అల్ దట్ బ్రీత్స్’ నామినేట్ అయ్యాయి. ఇక అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. దానితో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా ఆస్కార్ గెలుచుకుంది.
RRR : ఈ విజయాన్ని చరణ్‌కి మాత్రమే ట్రిబ్యూట్ చేయకండి.. చిరంజీవి!
కాగా RRR ఆస్కార్ అందుకోవడంతో చిరంజీవి తన ఆనందాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చిరు మాట్లాడుతూ.. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎందుకంటే ఈ పాట ప్రపంచం మొత్తాన్ని ఊర్రుతలుగించడమే కాకుండా గోల్డెన్ గ్లోబ్ తో పాటు పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. అయితే ఎక్కడో చిన్న భయం అయితే ఉంది. చివరికి అందరూ అనుకున్నట్లే RRR కి ఆస్కార్ రావడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చరిత్రగా భావిస్తున్నా.
RRR : నాటు నాటు ఆస్కార్ గెలుచుకోవడం పై సినీ సెలబ్రెటీస్ ట్వీట్స్..
ఒక సినిమా వాడిగా మాకు ఆస్కార్ అనేది ఒక అంతులేని గౌరవం లాంటిది. నేను యుద్దభూమి సినిమా చేస్తున్న సమయంలో నాకు ఆస్కార్ కి ఆహ్వానం వచ్చి ఒక అతిధిగా ఆ అవార్డ్స్ కి వెళ్ళాను. దానినే నేను ఎంతో గౌరవంగా భావించాను. కానీ ఈరోజు తారక్ అండ్ చరణ్ ఆస్కార్ గెలుచుకోవడం, నాకు ముఖ్యంగా అందులో నా కొడుకు కూడా ఒక భాగం కావడం చాలా గర్వంగా ఉంది. ఇక ఆ వేడుకల్లో నాటు నాటు సాంగ్ పర్ఫార్మ్ చేసిన తరువాత అక్కడ ఉన్న వారంతా నిలబడి, మన తెలుగు పాటకి చప్పట్లు కొట్టడం చూసి నాకు గూస్‌బంప్స్ వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు.
