RRR : ఈ విజయాన్ని చరణ్‌కి మాత్రమే యాట్రిబ్యూట్ చేయకండి.. చిరంజీవి!
95వ ఆస్కార్ అవార్డుల్లో అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. RRR ఆస్కార్ గెలుచుకోవడం పై చిరు హర్షం వ్యక్తం చేస్తూ మూవీ టీంని అభినందించాడు. అయితే ఈ విజయాన్ని చరణ్ కి మాత్రమే..

chiranjeevi says do not tribute rrr success to ram charan only
RRR : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇక ఈ ఏడాది ఆస్కార్స్ కి భారతదేశం తరుపు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘అల్ దట్ బ్రీత్స్’ నామినేట్ అయ్యాయి. ఇక అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. దానితో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా ఆస్కార్ గెలుచుకుంది.
RRR : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి.. RRR టీంకి పవన్ అభినందనలు!
ఇక ఈ రెండు చిత్రాలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా RRR ఆస్కార్ గెలుచుకోవడం పై చిరు హర్షం వ్యక్తం చేస్తూ మూవీ టీంని అభినందించాడు. ఒకప్పుడు ఇండియాలోని ఇతర ప్రాంతాల వారికీ కూడా తెలుగు జాతి ఒకటి ఉందని ఎవరికి తెలియదు. మద్రాసీలుగా గుర్తించే మనల్ని తెలుగు వారిగా నేషనల్ వైడ్ పరిచయం చేసిన మూవీ శంకరాభరణం సినిమా. ఆ తరువాత నేడు RRR నేషనల్ వైడ్ వైడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు వారికీ గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకు కారణం అయ్యిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్, ఎన్టీఆర్, చరణ్ లకు నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఒక విలేకరి మాట్లాడుతూ.. చరణ్ ఇంటర్నేషనల్ స్థాయిలో పలు పాపులర్ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి RRR ని ప్రమోట్ చేసి ఆస్కార్ కి దోహద పడ్డాడు, అందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించగా, చిరు బదులిస్తూ.. ఈ విజయాన్ని కేవలం చరణ్ కి మాత్రమే యాట్రిబ్యూట్ చేయకండి. ఇది మొత్తం టీం కృషి. సాంగ్ చిత్రీకరణ దగ్గర నుంచి, ప్రమోషన్ వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్ట పడ్డారు. ఇక సాంగ్ చిత్రీకరణ సమయంలో తారక్ అండ్ చరణ్ కి ఎన్నో గాయాలు అయ్యిని. నేడు వాళ్ళ కష్టానికి ఫలితం చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.